Passport: ఇకపై పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో భాగంగా సోషల్ మీడియా అకౌంట్ల తనిఖీ.. ఎక్కడో తెలుసా..?
Passport Applicants: మన దేశంలో పాస్‌పోర్ట్ పొందే ప్రక్రియ చాలా సుధీర్ఘంగా ఉంటుంది. పాస్‌పోర్ట్ మంజూరు చేసే సమయంలో అభ్యర్థి పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాతే ఇస్తారు. ముఖ్యంగా...
Passport Applicants: మన దేశంలో పాస్‌పోర్ట్ పొందే ప్రక్రియ చాలా సుధీర్ఘంగా ఉంటుంది. పాస్‌పోర్ట్ మంజూరు చేసే సమయంలో అభ్యర్థి పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాతే ఇస్తారు. ముఖ్యంగా సదరు వ్యక్తి నేర చరిత్రను తెలుసుకోవడానికి పోలీసులు కూడా విచారణ చేపడతారు. ఆ తర్వాతే పాస్‌పోర్టు అందిస్తారు. సాధారణంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి పాస్‌పోర్ట్ ఇవ్వడానికి పోలీసులు నిరాకరిస్తుంటారు. అయితే తాజాగా ఉత్తరాఖండ్ మరో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇకపై పాస్‌పోర్ట్ జారీ చేసే ముందు అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్లను సైతం పరిశీలించనున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. అభ్యర్థుల వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా వారి సోషల్ మీడియా అకౌంట్లను సైతం పోలీసులు చెక్ చేయనున్నారు. దేశానికి సంబంధించి అభ్యర్థి ఏమైనా అభ్యంతకర పోస్టులు చేశాడా, దేశ ద్రోహానికి సంబంధించి ఏమైనా పోస్ట్‌లు పెట్టాడా.? లాంటివి పరిశీలించనున్నారు. ఒకవేళ విచారణలో అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాల్లో ఇలాంటివేమైనా కనిపిస్తే.. అతనికి పాస్‌పోర్టు మంజూరు నిరాకరిస్తారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని కట్టడి చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ఇది కొత్తగా తీసుకొచ్చిన నిబంధన కాదని, దేశద్రోహానికి పాల్పడే వ్యక్తులకు పాస్‌పోర్టు మంజూరు చేయకూడదని పాస్‌పోర్ట్ చట్టాల్లోనే ఉందని ఆయన గుర్తుచేశారు.