Gold Price Today(06-02-2021): భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా..

Gold Price Today(06-02-2021): బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌. గత ఐదు రోజులుగా పసిడి దిగివస్తోంది. బడ్జెట్‌ ప్రతిపాదనలు, గ్లోబల్‌ మార్కెట్‌ డిమాండ్‌ తగ్గడంతో దేశీయ..

Gold Price Today(06-02-2021): భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా..
Follow us
Subhash Goud

|

Updated on: Feb 06, 2021 | 7:16 AM

Gold Price Today(06-02-2021): బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌. గత ఐదు రోజులుగా పసిడి దిగివస్తోంది. బడ్జెట్‌ ప్రతిపాదనలు, గ్లోబల్‌ మార్కెట్‌ డిమాండ్‌ తగ్గడంతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గి ప్రస్తుతం 43,750 ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.630 తగ్గి రూ. 47,730కి చేరుకుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,010 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 43,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,730 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,380 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,380 ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,590 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,740 ఉంది. ఇక కేంద్ర బడ్జెట్‌లో బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని ప్రతిపాదించడంతో పసిడిపై ప్రభావం పడిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Also Read: మరోసారి కెనడాలో కోవిడ్ అంక్షలు అమలు.. క్రూయిజ్ నౌకలపై మరో ఏడాది పాటు నిషేధం