AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Vaccines by Drone: డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. రిమోట్ ప్రాంతాలపై ఫోకస్..

ప్రస్తుత టెక్ యుగంలో ఏ పనికైనా స్పీడ్ చాలా ముఖ్యం.  వేగం ఇప్పుడు ప్రతి పనిలోను అత్యవసరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు రవాణా అత్యంత ఒత్తిడిని ఎదుర్కొంటున్న...

Covid-19 Vaccines by Drone: డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. రిమోట్ ప్రాంతాలపై ఫోకస్..
Ram Naramaneni
|

Updated on: Feb 05, 2021 | 3:43 PM

Share

Covid-19 Vaccines by Drone:  ప్రస్తుత టెక్ యుగంలో ఏ పనికైనా స్పీడ్ చాలా ముఖ్యం.  వేగం ఇప్పుడు ప్రతి పనిలోను అత్యవసరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు రవాణా అత్యంత ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేటి కాలంలో డ్రోన్ల ద్వారా డెలివరీ బాగా పుంచుకుంది. ప్రస్తుతం అత్యవసర సరుకులకు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉన్న డ్రోన్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు అవే డ్రోన్లు కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీలోనూ ముఖ్య భూమిక పోషించబోతున్నాయి. తాజాగా వింగ్‌కాప్టర్ కంపెనీ డ్రోన్ల ద్వారా COVID-19 వ్యాక్సిన్ పంపిణీని అందించే రేసులో చేరింది.

వింగ్‌కాప్టర్ డ్రోన్లు గంటకు 240 కిమీ (149 ఎంపిహెచ్) వేగంతో ప్రయాణిస్తూ  ప్రపంచ రికార్డు సృష్టించాయి. అంతేకాదు 6 కిలోల బరువు కలిగి ఉండే దాని బ్యాటరీ 100 కిలోమీటర్ల కంటే ఎక్కువదూరం ప్రయాణించేందుకు ఉపకరిస్తుంది. ఏకంగా 72 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినప్పటికీ స్థిరంగా ట్రావెల్ చెయ్యగలను.  రిమోట్ ప్రాంతాలతో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఈ డ్రోన్లు చాలా ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సరైన ఉష్టోగ్రతల మధ్య వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కూడా వింగ్‌కాప్టర్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఈ సంస్థ అనేక ట్రయల్ ప్రాజెక్ట్స్ లో తన సత్తా ఏంటో నిరూపించుకుంది. యూనిసెఫ్ సహకారంతో ఇప్పటికే అనేక ప్రాంతాలకే వ్యాక‌్సిన్ సరఫరా చేశామని సంస్థ ప్రతినిథులు తెలిపారు. లక్షలాది మంది ప్రజలకు వ్యాక్సిన్ చేరవేసే కార‌్యక్రమంలో భాగమవుతున్నందుకు వారు ఆనందం వ్యక్తం చేస్తున‌్నారు. 

Also Read:

China boys: అబ్బాయిల్లో ‘మగతనం’ పెంచే దిశగా చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం.. వివాదాస్పద నోటీసు జారీ

వాహనాదారులరా అలర్ట్.. ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే అంతే సంగతులు.. ఏ ఏ తప్పుకు ఎంత కట్టాలో తెలుసా ?