CORONAVIRUS: కరోనా వైరస్ రూపాంతరం..! వ్యాక్సిన్‌ల మార్పు అనివార్యమా? సైంటిస్టుల తాజా పరిశోధన తేలింది ఇదే!

కరోనా వైరస్ గురించి ఖతర్నాక్ వార్త వెలువడింది. వైరస్ మరింతగా ఎఫెక్టివ్‌గా మారుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి అనుగుణంగా వ్యాక్సిన్లను మరింత మెరుగు పరచాల్సిన అవసరం వుందని వారంటున్నారు.

CORONAVIRUS: కరోనా వైరస్ రూపాంతరం..! వ్యాక్సిన్‌ల మార్పు అనివార్యమా? సైంటిస్టుల తాజా పరిశోధన తేలింది ఇదే!
Follow us

|

Updated on: Feb 05, 2021 | 4:12 PM

Coronavirus upgrading itself, US scientists revealed: దాదాపు ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా వైరస్ గురించిన చర్చే. ముందుగా ఈ కరోనా అంటే ఏంటి అన్న దగ్గర మొదలైన చర్చ… దాని వ్యాప్తి, తీరుతెన్నులు, ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో ఎందుకింత జాప్యం? వైరస్ సోకితే ఏ సమస్యలు ఎదురవుతాయి? వైరస్ సోకిన వారి లక్షణాలేంటి? వైరస్ రూపాంతరం చెందే అవకాశాలున్నాయా? ఇంతటి డేంజరస్ వైరస్‌ని నిరోధించేదెలా? నిరోధం సాధ్యం కాకనే లాక్ డౌన్ విధింపా? ఇలా గత ఏడాది కాలంగా తరచూ వినిపిస్తున్న ప్రశ్నలే ఇవి. ముందుగా వైరస్‌ నిరోధం దగ్గర మొదలైన ప్రయోగాలు.. చివరికి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనే దాకా చేరాయి. అయితే.. కరోనా వైరస్‌కు ఓ వైపు విరుగుడు కనుగొంటున్న తరుణంలోనే మరోవైపు కరోనా వైరస్ రూపొంతరం చెందడం మొదలైంది.

ముఖ్యంగా యుకేలో కరోనా వైరస్ స్ట్రెయిన్ వైరస్‌గా రూపాంతరం చెంది మరింత ఖతర్నాక్‌గా మారింది. ఈ రూపాంతరం చెందిన స్ట్రెయిన్ వైరస్ తమ తమ దేశాలకు చేరకుండా పలు దేశాలు పకడ్బందీ చర్యలను తీసుకున్నాయి. యుకేకు సమీపంలో వున్న యూరోపియన్ కంట్రీస్ రెండో విడత లాక్ డౌన్‌ను విధించి, మరింత కట్టుదిట్టంగా అమలు చేయడం ప్రారంభించాయి. మన దేశం కూడా యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చిన వారి వివరాలను తెలుసుకుని వారి పట్ల పక్కా చర్యలు చేపట్టింది. వారి హోం క్వారంటైన్‌ని ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికరమైన అంశం తెరమీదికి వచ్చింది.

కరోనా వైరస్‌లో జరుగుతున్న పరివర్తనం (మార్పు) ఒక నిర్దిష్టమైన డెవలప్‌మెంటును సైంటిస్టులు గుర్తించారు. ఈ పరివర్తనం వల్ల మానవ శరీరంలోకి రోగ నిరోధక వ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీలను అధిగమించే సామర్థ్యం కరోనా వైరస్‌కు వస్తుందని తేలింది. అంటే ఈ మార్పు యాంటీ బాడీలను ఏమార్చే శక్తిని వైరస్‌కు కలుగజేస్తుందన్నమాట. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లను రూపొంతరం (పరివర్తనం) చెందిన కొత్త వైరస్ భవిష్యత్‌లో నీరుగార్చే ప్రమాదం ఉందా అన్నది గుర్తించేందుకు సైంటిస్టులు కనుగొన్న ఈ కొత్త విషయం ఉపయోగపడుతుందని అంఛనా వేస్తున్నారు.

అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ పరిశోధన చేశారు. కరోనా వైరస్‌పై ఉండే స్పైక్‌ ప్రొటీన్‌ జన్యుక్రమంలో కొన్ని తొలగింపులు జరుగుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. దాదాపు లక్షన్నర జన్యు క్రమాలను అనలైజ్ చేసిన సైంటిస్టులు కరోనా వైరస్ పరివర్తనం (రూపాంతరం) చెందుతోందని, ఈ మార్పు వ్యాక్సిన్‌లను మరింత మెరుగు పరచాల్సిన అవసరాన్ని కలుగ జేస్తోందని సైంటిస్టులు తాజాగా వెల్లడించారు. ఇలాంటి ఉత్పరివర్తనలు కలిగిన వైరస్‌ రకాలను ప్రస్తుత యాంటీబాడీలు అడ్డుకోలేవని వారంటున్నారు. దీర్ఘకాలం కోవిడ్‌తో బాధపడ్డ వారిలో ఇలాంటి రకాలను తొమ్మిది సందర్భాల్లో గుర్తించినట్లు చెప్పారు.

రోగ నిరోధక శక్తి పటిష్ఠంగా లేని ఒక వ్యక్తిలో ముందుగా ఈ పరివర్తనాన్ని కనుగొన్నామని సైంటిస్టులు తెలిపారు. అతడు కరోనా వైరస్‌తో 74 రోజులు పాటు ఇబ్బందిపడి చనిపోయాడని పేర్కొన్నారు. రోగ నిరోధక వ్యవస్థకు కరోనా వైరస్‌కు మధ్య ఇంత సుదీర్ఘకాలం జరిగే పోరాటం.. ఇలాంటి పరివర్తనాలు, ఉత్పరివర్తనాల ఆవిర్భావానికి కారణమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే యాంటీబాడీల రక్షణను ఇవి ఎంత మేరకు వీక్ చేస్తాయన్నది ఇంకా క్లారిటీ రాలేదని పరిశోధనల్లో కీలకంగా వ్యవహరించిన సీనియర్ సైంటిస్టు కెవిన్‌ మెక్‌కార్తి వెల్లడించారు. అయితే భవిష్యత్‌లో ఏదో ఒక సమయంలో కోవిడ్‌ వ్యాక్సిన్లలో మార్పులు అనివార్యమని ఆయన అంటున్నారు.

Also Read: ‘ఆ’ దేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారా? ఇవి పాటించకపోతే మీరు ఇబ్బందుల్లో పడడం ఖాయం