AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Waste Management: కరోనా నివారణ కోసం వాడుతున్న వేస్ట్ మాస్కులకు అర్ధాన్ని కల్పించిన శాస్త్రవేత్తలు.. బెస్ట్ రోడ్ల నిర్మాణం

కరోనా తర్వాత ప్రపంచం మొత్తం మాస్క్ లను ధరించడం మొదలు పెట్టింది. అయితే ఒక్కరోజులో వాడే మాస్కుల సంఖ్య ఎంతో ఎవరైనా అంచనా వేయగలరా..! ఒక్కరోజులో ప్రపంచంలోని ప్రజలు ఉపయోగిస్తున్న మాస్క్‌లు అక్షరాలా...

Covid-19 Waste Management: కరోనా నివారణ కోసం వాడుతున్న వేస్ట్ మాస్కులకు అర్ధాన్ని కల్పించిన శాస్త్రవేత్తలు.. బెస్ట్ రోడ్ల నిర్మాణం
Surya Kala
|

Updated on: Feb 05, 2021 | 1:40 PM

Share

Covid-19 Waste Management: ప్రపంచంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్ వేసుకున్నా.. కోవిడ్ నిబంధనలు తప్పనిసరని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించింది. కరోనా వైరస్ నివారణకు మాస్క్ ధరించడం, హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం తప్పనిసరని అందరికి తెలిసిందే.. కరోనా తర్వాత ప్రపంచం మొత్తం మాస్క్ లను ధరించడం మొదలు పెట్టింది. అయితే ఒక్కరోజులో వాడే మాస్కుల సంఖ్య ఎంతో ఎవరైనా అంచనా వేయగలరా..! ఒక్కరోజులో ప్రపంచంలోని ప్రజలు ఉపయోగిస్తున్న మాస్క్‌లు అక్షరాలా 680 కోట్లు..

అయితే ఈ మాస్క్‌లను కొంతమంది మళ్ళీ మళ్ళీ వాడుకునే విధంగా బట్టతో కుట్టినవి వాడుతున్నారు.. అయితే చాలా మంది యూజ్ అండ్ త్రో మాస్కులను వాడుతున్నారు. అలా ఒక్కరోజులో వాడే కోట్లాది మాస్కులు చెత్తకుప్పలో చేరుతున్నాయి. ఈ వ్యర్ధాలతో మళ్ళీ సరికొత్త ప్రాబ్లెమ్ తలెత్తడానికి అవకాశం ఉందని ఎప్పటి నుంచో పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీంతో కొంతమంది ఆ వ్యర్ధాలకు సరికొత్త అర్ధం కలిపించాలని ఆలోచించారు.. అయితే ఆ ప్రయత్నం చేసి సక్సెస్ సాధించారు. ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ శాస్త్రవేత్తలు. వివరాల్లోకి వెళ్తే..

ఒక్కరోజులో వాడి పడేస్తున్న మాస్కులను ముక్కలు గా చేసి.. భవనాల వ్యర్థాలకు కలిసి ఓ కాంక్రీట్ ను తయారు చేశారు. ఆ సరికొత్త పదార్ధాన్ని రోడ్డును నిర్మించడానికి ఉయోగించడానికి పనికి వచ్చేదిగా గుర్తించారు. 99 పాళ్ల రీసైకిల్డ్‌ కాంక్రీట్‌ అగ్రిగేట్‌ ( ఆర్‌సీఏ ) భవన వ్యర్థానికి ఒక పాలు మాస్కు ముక్కలు జోడించి వీరు ఈ పదార్థాన్ని తయారు చేశారు. ఈ పదార్ధంతో నిర్మించిన రోడ్డు దృఢంగా ఉందని శాస్త్రవేతలు తెలిపారు.

ఈ పదార్ధ స్టామినాను తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులు అనేక పరీక్షలు నిర్వహించారు. రహదారి నిర్మాణంలోని తొలి మూడు పొరలకు ఈ పదార్థాన్ని వాడవచ్చునని తమ పరీక్షల్లో స్పష్టమైందని చెప్పారు. కిలోమీటరు రహదారి నిర్మాణంలో దాదాపు 30 లక్షల మాస్కు వ్యర్థాలను వాడుకోవచ్చునని, తద్వారా 93 టన్నుల వ్యర్థాలు చెత్తకుప్పల్లోకి చేరకుండా నివారించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మహమ్మద్‌ సాబేరియన్‌ తెలిపారు.

అయితే కరోనా నివారణ కోసం వాడుతున్న ఈ మాస్క్ లను మళ్ళీ సేఫ్ గా సేకరించాలని అది నిర్మాణ స్థలానికి తీసుకుని రావాలని… అది సవాల్‌తో కూడుకున్నదని తెలిపారు. అయితే కోవిడ్ ప్రపంచ పర్యావరణానికి తీసుకొచ్చిన కొత్త సమస్యకు ఇది సరికొత్త పరిష్కార మార్గమని వివరించారు. అయితే తమ నెక్స్ట్ పరిశోధన వాడేసిన పిపికిట్స్‌ను రీసైకిల్ చేయడమని .. ఇప్పటికే తాము ఆదిశగా పరిశోధనలు మొదలు పెట్టమని మహ్మద్ సాబేరియన్ చెప్పారు.

Also Read:

ఆచితూచి ఆడుతోన్న ఇంగ్లాండ్.. క్రీజులో కెప్టెన్ జో రూట్..

మళ్లీ మొదలైన విశాఖ ఉక్కు ఉద్యమం.. అఖిల పక్షం, కార్మిక సంఘాల ఆందోళన.. మహాధర్నా