Vizag Steel Plant: మళ్లీ మొదలైన విశాఖ ఉక్కు ఉద్యమం.. అఖిల పక్షం, కార్మిక సంఘాల ఆందోళన.. మహాధర్నా
Vizag Steel Plant: విశాఖ ఉక్కు కోసం ఉద్యమం మళ్లీ మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. విశాఖలో అఖిలపక్షం...
Vizag Steel Plant: విశాఖ ఉక్కు కోసం ఉద్యమం మళ్లీ మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. విశాఖలో అఖిలపక్షం, కార్మిక సంఘాల ఆందోళన కొనసాగిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కూర్మన్నపాలెంలో కార్మిక సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర కార్మిక సంఘాలు మహాధర్నా చేపట్టాయి.
కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని మిగతా కర్మాగారాల లాగా కేవలం ఒక పరిశ్రమగా మాత్రమే చూడొద్దని, విశాఖ ఉక్కు మా ఆత్మ గౌరవమని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.