AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WHO Team Wuhan: వూహాన్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం పర్యటన.. కరోనాపై క్లారిటీ ఇస్తుందా..?

WHO Team Wuhan: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేసింది. అయితే ఈ వైరస్‌ చైనాలోని వూహాన్‌లో పుట్టిందని, అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు పాకిందని చాలా..

WHO Team Wuhan: వూహాన్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం పర్యటన.. కరోనాపై క్లారిటీ ఇస్తుందా..?
Subhash Goud
|

Updated on: Feb 06, 2021 | 7:15 AM

Share

WHO Team Wuhan: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేసింది. అయితే ఈ వైరస్‌ చైనాలోని వూహాన్‌లో పుట్టిందని, అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు పాకిందని చాలా కాలం నుంచి ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను చైనా ఖండిస్తూ వస్తోంది. అయితే అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా సహా పలు పలు దేశాల శాస్త్రవేత్తలు వూహాన్‌ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ పుట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం వూహాన్‌కు వెళ్లింది. నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు అక్కడ ఓ హోటల్‌లో క్వారంటైన్‌ ఉండి, క్వారంటైన్‌ గడువు ముగిసిన తర్వాత వూహాన్‌లో పర్యటన ప్రారంభించింది. ప్రస్తుతం వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నారు బృందం సభ్యులు.

చైనా శాస్త్రవేత్తలతో డబ్ల్యూహెచ్‌వో బృందం భేటీ

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం పర్యనటలో భాగంగా ప్రముఖ వైరాలజీ డాక్టర్‌ షీ ఝంగ్లీతో సహా పలువురు చైనా శాస్త్రవేత్తలతో డబ్ల్యూహెచ్‌వో బృందం భేటీ అయింది. అయితే ఝంగ్లీ మాత్రం మొదటి నుంచి ఈ ఆరోపణలు తోసి పుచ్చుతున్నారు. కరోనా వైరస్‌ వూహాన్‌ వైరాలజీ ల్యాబ్‌లో పుట్టే అవకాశమే లేదని వాదిస్తున్నారు.

వూహాన్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో సుమారు మూడున్నర గంటల పాటు డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్తలు సమావేశం అయ్యారు. పలు మార్కెట్లను పరిశీలించారు.  మొదట్లో కరోనా వ్యాప్తి చెందిన సమయంలో కరోనా పేషెంట్లకు వైద్యం అందించిన ఆస్పత్రులను సైతం పరిశీలించి అక్కడి వైద్యులతో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు బృందం సభ్యులు.

2019లో వూహాన్‌లో కరోనా వైరస్‌ ఇక్కడే తొలిసారిగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిదన్న ఆరోపణలున్నాయి. ఈ- మార్కెట్లో సముద్ర ఉత్పత్తులతో పాటు రకరకాల జంతువుల మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడే గబ్బిలాల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందన్న వాదన ఉంది. అయితే దీనిని చైనాప్రభుత్వం అంగీకరించడం లేదు. 2019 డిసెంబర్‌లో వూహాన్‌ కరోనా కేసులు బయట పడటంతో ఈ- మార్కెట్‌ను మూసివేసి శుభ్రం చేశారు. కరోనా వైరస్‌ పుట్టుకకు గల కారణాలపై అన్ని రకాల అధ్యయనం చేస్తున్నారు. ఈ బృందంలో వివిధ రంగంలో నిష్ణాతులైన 10 మంది సభ్యులున్నారు. కరోనాకు సంబంధించి ఏ అంశాన్నికూడా వదలకుండా అన్ని విధాలుగా పరిశీలిస్తోంది డబ్ల్యూహెచ్‌వో బృందం సభ్యులు.

Also Read: Fake Vaccine: నకిలీ కరోనా వ్యాక్సిన్ల సరఫరా.. 80 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. 3వేల నకిలీ టీకాల స్వాధీనం