India vs England, 1st Test: శతకొట్టిన జో రూట్.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్.. స్కోర్ వివరాలు ఇవే..

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 05, 2021 | 6:04 PM

India vs England, 1st Test, Day 1 LIVE Score: భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజు నుంచి చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభమైంది...

India vs England, 1st Test: శతకొట్టిన జో రూట్.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్.. స్కోర్ వివరాలు ఇవే..
India vs England

India vs England, 1st Test, Day 1 LIVE Score: మొదటి రోజు ఆట ముగిసింది. టీమిండియా ప్రభావం చూపకపోగా.. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడారు. కెప్టెన్ జో రూట్(128*) అజేయంగా నిలిచాడు. ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 263 పరుగులు చేసింది. అటు టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు.. అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.

అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు.. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ బర్న్స్(33) పరుగులకు పెవిలియన్ బాట పట్టినా.. మరో ఓపెనర్ సిబ్లి(87).. కెప్టెన్ జో రూట్(128*)కు మంచి సహకారాన్ని అందిస్తూ రెండు వందల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే దురదృష్టవశాత్తూ మొదటి రోజు చివరి ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా ఔట్ అయి సెంచరీ మిస్ చేసుకున్నాడు.

భారత జట్టు:

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానే(వైస్‌ కెప్టెన్‌), రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్‌ గిల్, రవిచంద్రన్‌ అశ్విన్, చతేశ్వర్‌ పుజారా, జస్ప్రీత్‌ బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాంత్ శర్మ, నదీమ్

ఇంగ్లాండ్ జట్టు:

జో రూట్(కెప్టెన్), లారెన్స్, సిబ్లి, స్టోక్స్, బర్న్స్, బట్లర్, పొప్, ఆర్చర్, ఆండర్సన్, బెస్, లీచ్

జో రూట్‌ 100వ టెస్ట్ మ్యాచ్…

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌కి ఇది 100వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. అంతేకాకుండా గత కొంతకాలం అతడు టెస్టుల్లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మరి ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.

తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ ఓపెనర్ దూరం..

తొలి టెస్టుకు ముందే ఇంగ్లాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ జాక్‌ క్రాలీ మణికట్టు గాయంతో మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ప్రాక్టీస్‌ సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌ బయట క్రాలే ఫ్లోర్‌పై జారిపడటంతో అతడి మణికట్టుకు గాయమైంది. దాంతో అతడు చెన్నై వేదికగా జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరమైనట్లు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు గురువారం ప్రకటించింది. అతడు తీవ్రనొప్పితో బాధపడుతున్నాడని ఇంగ్లాండ్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా క్రాలీ ఇంగ్లండ్‌ తరపున 10 టెస్టులాడి 616 పరుగులు చేశాడు.

మ్యాచ్‌ను లైవ్ టెలికాస్ట్ ఇలా చూడొచ్చు..

భారత్, ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. అంతేకాకుండా డిస్నీ హాట్‌స్టార్, డిస్నీ యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్ తిలకించవచ్చు. అలాగే లైవ్ స్కోర్ అండ్ కీలక అప్‌డేట్స్ కోసం

ఈ లింక్ క్లిక్ చేయండి.. https://tv9telugu.com/sports/cricket-news/series/india-vs-england-2021-22

టీమ్ ఇండియాకు షాక్, గాయం కారణంగా అక్షర్ పటేల్ మ్యాచ్‌కు దూరం..

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ప్రారంభానికి ముందే భారత క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్టు టాస్‌ ప్రారంభానికి ముందే స్పిన్నర్ అక్షర్ పటేల్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. మోకాలి గాయం కారణంగా అతడు తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ట్వీట్ చేసింది. అక్షర్ స్థానంలో షాబాజ్ నదీమ్, రాహుల్ చాహర్‌లను జట్టులోకి తీసుకుంది.

Key Events

జో రూట్ సూపర్ సెంచరీ…

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంక సిరీస్‌లో రెండు భారీ శతకాలు చేసిన అతడు.. ఈ మ్యాచ్‌లో సూపర్ కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్ చేశాడు. ఇప్పటికే సెంచరీ సాధించి.. క్రీజులో స్థిరపడ్డ రూట్‌ను.. రేపు మొదటి సెషన్‌లోనే టీమిండియా బౌలర్లు పెవిలియన్‌కు పంపిస్తే.. మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉంది.

ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్..

ప్రస్తుతం ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్(128*) క్రీజులో నిలదొక్కుకోగా.. ఆ తర్వాత స్టోక్స్, బట్లర్, పొప్ బరిలోకి దిగనున్నారు. వీరందరూ కూడా మంచి బ్యాట్స్‌మెన్.. ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించాలంటే.. వీరు క్రీజులో ఉండాలి. కాబట్టి భారత బౌలర్లు రెండో రోజు తక్కువ వ్యవధిలోనే ఇంగ్లీష్ మిడిల్ ఆర్డర్‌ను ఔట్ చేయాలి.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 05 Feb 2021 05:44 PM (IST)

    శతకొట్టిన జో రూట్.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్.. స్కోర్ వివరాలు ఇవే..

    మొదటి రోజు ఆట ముగిసింది. టీమిండియా ప్రభావం చూపకపోగా.. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడారు. కెప్టెన్ జో రూట్(128*) అజేయంగా నిలిచాడు. ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 263 పరుగులు చేసింది. అటు టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు.. అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు.

    అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు.. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ బర్న్స్(33) పరుగులకు పెవిలియన్ బాట పట్టినా.. మరో ఓపెనర్ సిబ్లి(87).. కెప్టెన్ జో రూట్(128*)కు మంచి సహకారాన్ని అందిస్తూ రెండు వందల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే దురదృష్టవశాత్తూ మొదటి రోజు చివరి ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా ఔట్ అయి సెంచరీ మిస్ చేసుకున్నాడు.

  • 05 Feb 2021 05:37 PM (IST)

    అర్ధ సెంచరీకి చేరువలో రూట్.. అశ్విన్ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు..

    శ్రీలంక సిరీస్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్.. ఆ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కుంటూ హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. అశ్విన్ వేసిన బౌలింగ్‌లో రెండు అద్భుతమైన ఫోర్లు బాదాడు.

  • 05 Feb 2021 04:57 PM (IST)

    ఇంగ్లాండ్ దూకుడు.. సిబ్లి, రూట్ మధ్య డబుల్ సెంచరీ భాగస్వామ్యం..

    మొదటి రోజు టీమిండియా తేలిపోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ డొమినిక్ సిబ్లి(87), కెప్టెన్ జో రూట్(128) భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కుని జట్టుకు భారీ స్కోర్ అందించే దిశగా దూసుకుపోతున్నారు. ఇద్దరూ కూడా రెండు వందల పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అటు టీమిండియా బౌలర్లలో అశ్విన్, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు. కాగా, 89 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 263/2 చేసింది.

  • 05 Feb 2021 04:11 PM (IST)

    రూట్ సూపర్ సెంచరీ.. టీమిండియా బౌలర్లను ఆడుకుంటోన్న ఇంగ్లాండ్ కెప్టెన్

    ఆట చివరి సెషన్‌లోకి ఎంటర్ అయింది. టీమిండియా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. సెకండ్ సెషన్‌లో వికెట్ పడలేదు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్(108) తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ.. అద్భుత సెంచరీని చేయగా.. సిబ్లి(83) మంచి సహకారాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం 80 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 235/2 చేసింది.

  • 05 Feb 2021 03:18 PM (IST)

    62 ఓవర్ల తర్వాత ఇంగ్లాండ్ 158/2

    62 ఓవర్ల తర్వాత ఇంగ్లాండ్ 158/2: వీలైనంత త్వరగా కొత్త బంతిని తీసుకురావాలని భారత్ చూస్తోంది. ఇషాంత్ పదునైన బంతులు సంధిస్తున్నా.. మరో ఎండ్ నుంచి సహకారం అందట్లేదు. సిబ్లీ, రూట్ అద్భుతంగా ఆడుతున్నారు.

  • 05 Feb 2021 03:15 PM (IST)

    ఇండియాపై అత్యధిక 50+ స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్

    ఇండియాపై అత్యధిక 50+ స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్: జో రూట్ - 14 * స్టీవెన్ స్మిత్ - 13 ఏంజెలో మాథ్యూస్ - 7

  • 05 Feb 2021 03:14 PM (IST)

    59 ఓవర్ల తర్వాత ఇంగ్లాండ్ 147/2

    59 ఓవర్ల తర్వాత ఇంగ్లాండ్ 147/2: 100వ టెస్టులో అర్ధ సెంచరీ కొట్టిన జో రూట్‌. మిడ్ వికెట్ మీదుగా బౌండరీ కొట్టి అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు.

  • 05 Feb 2021 03:11 PM (IST)

    58 ఓవర్ల తర్వాత ఇంగ్లాండ్ 141/2

    58 ఓవర్ల తర్వాత ఇంగ్లాండ్ 141/2: ఇషాంత్ నుంచి అద్భుతమైన ఆరంభం. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు సంధిస్తున్నాడు. సిబ్లీ 53 * మరియు రూట్ 45 * క్రీజులో ఉన్నారు.

  • 05 Feb 2021 02:57 PM (IST)

    టీ బ్రేక్.. అర్ధ సెంచరీ చేసిన సిబ్లి.. సూపర్ ఫామ్‌లో రూట్..

    ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడుతున్నారు. ఓపెనర్లు బర్న్స్(33), సిబ్లి(53) మంచి ఆరంభాన్ని అందించగా.. వెనువెంటనే వికెట్లు పడగొట్టి టీమిండియా మరోసారి ఆధిపత్యాన్ని చలాయించింది.. కెప్టెన్ జో రూట్(45) క్రీజులోకి వచ్చి మళ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. ప్రస్తుతం క్రీజులో సిబ్లి(53), రూట్(45) ఉన్నారు. 57 ఓవర్లకు రెండు వికెట్లకు 140 పరుగులు చేసింది.

  • 05 Feb 2021 01:47 PM (IST)

    50 ఓవర్లకు ఇంగ్లాండ్ 122/2

    అనుకున్నట్లుగా టీమిండియా బౌలర్లకు చెన్నై పిచ్ సహకారం అందించడం లేదు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కాస్త డిఫెన్సివ్‌గా ఉన్నా.. గ్రౌండ్ నలువైపులా రన్స్ మాత్రం రాబట్టుకోగలుగుతున్నారు. ఓపెనర్ డొమినిక్ సిబ్లి(49) అర్ధ సెంచరీకి చేరువలో ఉండగా.. కెప్టెన్ జో రూట్(33) అతడికి మంచి సహకారాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం 50 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ రెండు వికెట్లు నష్టపోయి 122 పరుగులు చేసింది.

  • 05 Feb 2021 01:12 PM (IST)

    41వ ఓవర్ బౌలింగ్ చేసిన సిడ్నీ టెస్టు హీరో..

    సిడ్నీ టెస్టు హీరో వాషింగ్టన్ సుందర్‌కు 41వ ఓవర్‌లో బౌలింగ్ వేసే అవకాశం దక్కింది. చక్కటి లైన్‌తో బౌలింగ్ వేసిన అతడి ఓవర్‌లో రూట్ రెండో బంతికి ఫోర్ కొట్టి, ఓ సింగిల్ తీశాడు. దీనితో ఆ ఓవర్‌లో ఇంగ్లాండ్ మొత్తం ఐదు పరుగులు రాబట్టింది. ప్రస్తుతం క్రీజులో రూట్(17), సిబ్లి(35)తో ఉన్నారు.

  • 05 Feb 2021 12:46 PM (IST)

    నిలదోక్కుకుంటోన్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్.. వికెట్ల కోసం ప్రయత్నిస్తున్న టీమిండియా బౌలర్లు.

    వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కెప్టెన్ జో రూట్(11) సహకారంతో సిబ్లి(29) స్కోర్ బోర్డును ముందుకు కదలిస్తున్నాడు. అటు టీమిండియా బౌలర్లు కీలకమైన జో రూట్ వికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక 35 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ రెండు వికెట్లు నష్టపోయి 79 పరుగులు చేసింది.

  • 05 Feb 2021 11:45 AM (IST)

    లంచ్ బ్రేక్.. రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. అధిపత్యం చలాయిస్తున్న టీమిండియా..

    తొలి టెస్టు మ్యాచ్‌లో మొదటి రెండు గంటల ఆట ముగిసింది. ఇరు జట్లు అద్భుతంగా ఆడగా.. టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కోహ్లీ మైండ్ గేమ్‌తో ఇంగ్లాండ్‌ రెండు వికెట్లు కోల్పోయింది. మంచి ఆరంభాన్ని ఇచ్చిన ఓపెనర్ రోరీ బర్న్స్ 33 పరుగులకు ఔట్ కాగా.. ఆ వెంటనే లారెన్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనితో ఇంగ్లాండ్ లంచ్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్(4), సిబ్లి(26) ఉన్నారు. ఇండియన్ బౌలర్లలో బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

  • 05 Feb 2021 11:30 AM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. లారెన్స్ డకౌట్..

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైండ్ గేమ్ ప్రదర్శిస్తున్నాడు. యువ బ్యాట్స్‌మెన్‌ లారెన్స్‌ను పెవిలియన్‌కు పంపించేందుకు బుమ్రాను బౌలింగ్‌లోకి దింపాడు. అనుకున్నట్లుగానే తన ఓవర్ నాలుగో బంతికి బూమ్.. బూమ్.. బుమ్రా మేజిక్ చేశాడు. లారెన్స్ వికెట్ల ముందు దొరికేశాడు. దీనితో లారెన్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఇంగ్లాండ్ 63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ప్రస్తుతం క్రీజులోకి వచ్చాడు.

  • 05 Feb 2021 11:22 AM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. 33 పరుగులకు బర్న్స్ ఔట్..

    స్పిన్నర్ అశ్విన్ ఇంగ్లాండ్‌కు గట్టి దెబ్బ తీశాడు. క్రీజులో నిలదొక్కుకుంటున్న ఓపెనర్ రోరీ బర్న్స్(33)ను పెవిలియన్‌కు పంపించాడు. అశ్విన్ బౌలింగ్‌లో బర్న్స్ వికెట్ కీపర్ పంత్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో ఇంగ్లాండ్ 63 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

  • 05 Feb 2021 11:04 AM (IST)

    20 ఓవర్లకు ఇంగ్లాండ్ 51/0

    ఓపెనర్లు డొమినిక్ సిబ్లి(24), రోరి బర్న్స్(25) ఇంగ్లాండ్ జట్టుకు చక్కటి ఆరంభాన్ని అందించారు. అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన వీరిద్దరూ.. టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నారు. ఇక 20 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లీష్ జట్టు వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది.

  • 05 Feb 2021 11:04 AM (IST)

    15 ఓవర్లకు ఇంగ్లాండ్ 37/0

    తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సమర్ధవంతంగా టీమిండియా బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కుంటోంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం తక్కువే ఉన్నా.. ఓపెనర్లు బర్న్స్(15), సిబ్లి(20) చక్కటి ఆరంభాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది.

  • 05 Feb 2021 10:35 AM (IST)

    డ్రింక్స్ బ్రేక్.. 12 ఓవర్లకు ఇంగ్లాండ్ 26/0

    తొలి టెస్ట్ మ్యాచ్ డ్రింక్స్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 26/0 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్(12), సిబ్లి(14)తో క్రీజులో ఉన్నారు. మొదటి గంట ఆట పూర్తయింది. బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. అయితే ఇంగ్లాండ్ మాత్రం వికెట్లు పారేసుకోకుండా ఆచితూచి ఆడుతోంది.

  • 05 Feb 2021 10:29 AM (IST)

    నిలకడగా ఆడుతోన్న ఇంగ్లాండ్ ఓపెనర్లు.. 10 ఓవర్లకు 20/0

    భారత్ బౌలింగ్ ఎటాక్‌ను ఇంగ్లాండ్ ఓపెనర్లు బర్న్స్(9), సిబ్లి(8) సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నారు. బుమ్రా, ఇషాంత్, అశ్విన్‌ల బౌలింగ్‌లో ఆచితూచి ఆడుతున్నారు. అవసరమైన బంతులను ఆడుతూ.. అనవసరమైన బంతులను వదిలేస్తున్నారు. దీనితో ఇంగ్లీష్ జట్టు 10 ఓవర్లకు 20/0 చేసింది.

  • 05 Feb 2021 10:22 AM (IST)

    కుల్దీప్‌ను ఎప్పుడు ఆడిస్తారు.? ఆకాష్ చోప్రా కామెంట్స్..

    తుది జట్టులోకి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకోకపోవడంపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశ్నించాడు. అశ్విన్-జడేజా ఉన్నప్పుడు కుల్దీప్ ఆడలేడు. జడేజా లేనప్పటికీ కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. మరి ఎప్పుడు ఆడతాడంటూ ట్వీట్ చేశాడు.

  • 05 Feb 2021 10:16 AM (IST)

    స్పిన్ ఎటాక్ షూరూ.. మొదటిఫోర్ కొట్టిన సిబ్లి..

    విరాట్ కోహ్లీ స్పిన్ ఎటాక్ షూరూ చేశాడు. అనుభవం ఉన్న అశ్విన్ బరిలోకి దిగాడు. అయితే రెండో బంతికి అనూహ్యంగా సిబ్లి చక్కటి బంతిని ఫోర్‌గా మలిచాడు. దీనితో అశ్విన్ ఓవర్‌లో ఇంగ్లాండ్ 6 పరుగులు రాబట్టింది. ఇక 8 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లీష్ జట్టు స్కోర్ 16/0

  • 05 Feb 2021 09:59 AM (IST)

    ఆచితూచి ఆడుతోన్న ఇంగ్లాండ్ ఓపెనర్స్..

    ఇంగ్లాండ్ ఓపెనర్స్ టీమిండియా బౌలింగ్ ఎటాక్‌ను సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నారు. సిబ్లి, బర్న్స్ అనవరమైన బంతులను వదిలేసి.. చక్కటి బంతులను ఆడుతున్నారు. దీనితో ఇంగ్లాండ్ 5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. సిబ్లి 2 పరుగులు చేయగా.. బర్న్స్ 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • 05 Feb 2021 09:52 AM (IST)

    క్యాచ్‌ను మిస్ చేసిన రిషబ్ పంత్..

    సొంత మైదానంలో తొలిసారి బౌలింగ్ చేస్తున్న జస్ప్రిత్ బుమ్రా.. మొదటి ఓవర్‌లోనే పదునైన బంతులను సంధించాడు. ఓవర్ మొదటి బంతికి బర్న్స్ ఇచ్చిన క్యాచ్‌ను రిషబ్ పంత్ చేజార్చాడు. అయితే అది కొంచెం కష్టమైన క్యాచ్ అని చెప్పొచ్చు.

    ఇంగ్లాండ్ 2/0

  • 05 Feb 2021 09:45 AM (IST)

    చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో ఇషాంత్ శర్మ తొలి ఓవర్..

    ఏడాది తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్న ఇషాంత్.. తన మొదటి ఓవర్‌లో ఖచ్చితమైన లైన్, లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. రెండవ బంతి మినహా మిగతా బంతులన్నీ ఆఫ్-స్టంప్ లైన్‌లో వేశాడు.

    మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ 1/0

  • 05 Feb 2021 09:42 AM (IST)

    తొలి ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ..

    ఇంగ్లాండ్ బ్యాటింగ్ ప్రారంభమైంది. బర్న్స్, డోమ్ సిబ్లీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇషాంత్ శర్మ భారత్ తరఫున బౌలింగ్ ప్రారంభించాడు. రెండవ బంతికి, బర్న్స్ ఒక పరుగుతో జట్టు ఖాతాను తెరిచాడు.

  • 05 Feb 2021 09:35 AM (IST)

    జో రూట్‌ 100వ టెస్ట్ మ్యాచ్...

    ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌కి ఇది 100వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. అంతేకాకుండా గత కొంతకాలం అతడు టెస్టుల్లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మరి ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.

  • 05 Feb 2021 09:13 AM (IST)

    తొలి టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే..

    జో రూట్(కెప్టెన్), లారెన్స్, సిబ్లి, స్టోక్స్, బర్న్స్, బట్లర్, పొప్, ఆర్చర్, ఆండర్సన్, బెస్, లీచ్

    ఓపెనర్లుగా.. బర్న్స్, సిబ్లి

  • 05 Feb 2021 09:12 AM (IST)

    తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇదే..

    విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానే(వైస్‌ కెప్టెన్‌), రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్‌ గిల్, రవిచంద్రన్‌ అశ్విన్, చతేశ్వర్‌ పుజారా, జస్ప్రీత్‌ బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాంత్ శర్మ, నదీమ్

    ఓపెనర్లుగా.. రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్

  • 05 Feb 2021 09:11 AM (IST)

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

    భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతిని ఇచ్చింది. అలాగే రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. అటు ఇంగ్లాండ్ టీం ఇద్దరి స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.

  • 05 Feb 2021 09:02 AM (IST)

    సాధన చేస్తోన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..

    తొలి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా, కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారు. నెట్స్‌లో బాగా శ్రమిస్తున్నారు. ఆ దృశ్యాలను చెన్నై చెపాక్ స్టేడియం నుంచి మీకోసం..

  • 05 Feb 2021 09:00 AM (IST)

    భారత్, ఇంగ్లాండ్ పోరుకు రంగం సిద్ధం...

    భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజు నుంచి చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభమైంది. రెండు జట్లు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి.

  • 05 Feb 2021 08:51 AM (IST)

    తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ ఓపెనర్ దూరం..

    తోలి టెస్టుకు ముందే ఇంగ్లాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ జాక్‌ క్రాలీ మణికట్టు గాయంతో మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ప్రాక్టీస్‌ సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌ బయట క్రాలే ఫ్లోర్‌పై జారిపడటంతో అతడి మణికట్టుకు గాయమైంది. దాంతో అతడు చెన్నై వేదికగా జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరమైనట్లు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు గురువారం ప్రకటించింది. అతడు తీవ్రనొప్పితో బాధపడుతున్నాడని ఇంగ్లాండ్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా క్రాలీ ఇంగ్లండ్‌ తరపున 10 టెస్టులాడి 616 పరుగులు చేశాడు.

  • 05 Feb 2021 08:49 AM (IST)

    మ్యాచ్‌ను లైవ్ టెలికాస్ట్ ఇలా చూడొచ్చు..

    భారత్, ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. అంతేకాకుండా డిస్నీ హాట్‌స్టార్, డిస్నీ యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్ తిలకించవచ్చు. అలాగే లైవ్ స్కోర్ అండ్ కీలక అప్‌డేట్స్ కోసం

    ఈ లింక్ క్లిక్ చేయండి.. https://tv9telugu.com/sports/cricket-news/series/india-vs-england-2021-22

  • 05 Feb 2021 08:48 AM (IST)

    టీమ్ ఇండియాకు షాక్, గాయం కారణంగా అక్షర్ పటేల్ మ్యాచ్‌కు దూరం..

    ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ప్రారంభానికి ముందే భారత క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్టు టాస్‌ ప్రారంభానికి ముందే స్పిన్నర్ అక్షర్ పటేల్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. మోకాలి గాయం కారణంగా అతడు తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ట్వీట్ చేసింది. అక్షర్ స్థానంలో షాబాజ్ నదీమ్, రాహుల్ చాహర్‌లను జట్టులోకి తీసుకుంది.

  • 05 Feb 2021 08:44 AM (IST)

    Chennai Weather Forecast, Pitch Report: చివరి రెండు రోజులు వర్షం పడే అవకాశం..

    చెన్నై పిచ్ స్పిన్నర్స్‌కు స్వర్గధామ. ఈ పిచ్‌లో చివరిగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ 759/7 డిక్లేర్(2016లో) భారీ స్కోర్ సాధించగా.. టీమిండియా గెలుపులో రవీంద్ర జడేజా ఏడు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. చెన్నైలో ఐదు రోజులు పొడి, తేమ వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కనిష్ట స్థాయి 21-22 డిగ్రీలు.. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉండొచ్చు. అలాగే మ్యాచ్ చివరి రెండు రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

  • 05 Feb 2021 08:43 AM (IST)

    ఇండియా- ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌‌‌‌కు అంపైర్లు ముగ్గురూ భారతీయులే..

    ఆస్ట్రేలియాతో అద్భుత విజయం సాధించిన టీమిండియా ఇప్పడు ఇంగ్లాండ్ తో తలపడటానికి సిద్ధంగా ఉంది. అయితే ఇండియా -ఇంగ్లాండ్ సిరీస్ కు అంపైరింగ్ బాధ్య‌త‌ల‌ను ముగ్గురు భారత అంపైర్ లు నిర్వహించనున్నారు. వీరిలో ఇద్దరు తొలిసారి టెస్ట్ మ్యాచ్ కు అంపైరింగ్ చేస్తున్నారు.

    ఐసీసీ ఎమిరేట్స్ ప్యానెల్‌లో ఉన్న‌ వీరేంద‌ర్ శ‌ర్మ‌, అనిల్ చౌద‌రి తొలిసారి టెస్టుల్లో అంపైరింగ్ చేయ‌నున్నారు. వీరితోపాటు ఇండియా ఎలైట్ ప్యానెల్లో ఉన్న అంపైర్ నితిన్ మీన‌న్ కూడా ఉన్నారు. కాగా నితిన్ గతంలో టెస్టు మ్యాచ్‌లో అంపైరింగ్ చేశారు.  కరోనా నేపథ్యంలో ప్రయాణ సమస్యలు తలెత్తడంతో స్థానిక అంపైర్లకే ఐసీసీ క‌ల్పించింది.

Published On - Feb 05,2021 5:44 PM

Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో