దేశవ్యాప్తంగా వేగంగా సాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. 50 లక్షల మార్కును దాటిన టీకా పంపిణీ

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్‌లో వడివడిగా సాగుతోంది. శనివారం నాటికి వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 50 లక్షల మార్కును దాటింది.

దేశవ్యాప్తంగా వేగంగా సాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. 50 లక్షల మార్కును దాటిన టీకా పంపిణీ
Covid-19 Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 06, 2021 | 9:15 PM

Covid 19 shots in India : ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్‌లో వడివడిగా సాగుతోంది. శనివారం నాటికి వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 50 లక్షల మార్కును దాటింది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఉన్న వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 56,36,868 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 52,66,175 మంది వైద్యులతో పాటు వైద్య రంగ సిబ్బంది, 3,70,693 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఉన్నట్లు ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అజ్ఞాని తెలిపారు. కేవలం 22 రోజుల్లోనే 50 లక్షల మార్క్‌ను అందుకున్నట్లు వివరించారు. దీంతో భారత్ మరో ఘనత సాధించిందని కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన కీలక వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.

50 లక్షల మందికి వ్యాక్సిన్‌ను వేయడానికి అమెరికాలో 24 రోజులు సమయం పట్టింది. అటు బ్రిటన్‌లో 43 రోజులు, ఇజ్రాయెల్‌లో 45 రోజుల సమయం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అజ్ఞాని తెలిపారు. భారత్‌లో నిర్దేశిత లక్ష్యంలో 60% పైగా వ్యాక్సినేషన్ పూర్తిచేశామన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం పేర్లను నమోదు చేసుకున్న హెల్త్ కేర్ వర్కర్లలో 54.7% మందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 4.5% మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందని ఆయన తెలిపారు.

ఇప్పటివరకు దేశంలోని 13 రాష్ట్రాలల్లో కోవిడ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. బీహార్, మధ్యప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో ఇప్పటివరకు 76 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందన్నారు. మరో 12 రాష్ట్రాల్లో 40 శాతం కంటే తక్కువ వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. కాగా, వ్యాక్సినేషన్ అనంతరం ఇప్పటి వరకు 22 మంది మాత్రమే చనిపోయారన్న ఆయన పేర్కొన్నారు. వీరిలో ఆస్పత్రిలో చనిపోయినవారు 9 మంది కాగా, ఆస్పత్రి బయట 13 మంది మరణించారన్న ఆయన.. ఈ మరణాలకు వ్యాక్సిన్‌కు సంబంధం లేదన్నారు.

ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ అనంతరం ఇప్పటివరకు 47మంది అస్వస్థతకు గురయ్యారని మనోహార్ తెలిపారు. వీరిలో 28 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, 19 మంది కోలుకుని చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యినట్లు మనోహర్ అజ్ఞాని వెల్లడించారు.

Read Also…  జమ్మూ కాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు…సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై అనూహ్యంగా కాల్పులు..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!