మహారాష్ట్రలో తగ్గని కరోనా వైరస్ తీవ్రత.. 20 లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య

మహారాష్ట్రలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంది.

మహారాష్ట్రలో తగ్గని కరోనా వైరస్ తీవ్రత.. 20 లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య
Maharashtra Corona Updates
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 06, 2021 | 10:11 PM

Maharashtra corona cases : తొలినాళ్లలో దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో మరోసారి మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంది. ఇక కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 51 వేలు దాటింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 2,768 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో మరో 25 కరోనా బారినపడి ప్రాణాలను కోల్పోయారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,41,398కు చేరుకోగా, కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 51,280కు చేరింది. ఈమేరకు మహారాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు.

మరోవైపు గత 24 గంటల్లో 1,739 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలు­కున్న వారి మొత్తం సంఖ్య 19,53,926కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 34,934 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతుంది.

Read Also…. Madhya Pradesh : నలుగురు మహిళలకు ఐదేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు.. కారణం ఇదే..