Coronavirus in Brazil: బ్రెజిల్ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు.. భారత్ కు ఇది హెచ్చరిక అంటున్న వైద్యనిపుణులు

ఏ దేశంలో కరోనా వైరస్ తగ్గుతుందో ఏ దేశంలో మళ్ళీ విజృంభిస్తోందో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. అసలు కరోనా రూపమేమిటీనేది శాస్త్రజ్ఞులకు అర్ధం కావడంలేదు.. తాజాగా మళ్ళీ దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ లో..

Coronavirus in Brazil: బ్రెజిల్ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు.. భారత్ కు ఇది హెచ్చరిక అంటున్న వైద్యనిపుణులు
Follow us

|

Updated on: Feb 07, 2021 | 7:37 AM

Coronavirus in Brazil: ఏ రోజున చైనాలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో.. అప్పటి నుంచి ఈ వైరస్ రకరకాల రూపాలను మార్చుకుంటూ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఎప్పుడు ఏ దేశంలో కరోనా వైరస్ తగ్గుతుందో ఏ దేశంలో మళ్ళీ విజృంభిస్తోందో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. అసలు కరోనా రూపమేమిటీనేది శాస్త్రజ్ఞులకు అర్ధం కావడంలేదు.. తాజాగా మళ్ళీ దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ లో కరోనా విజృంభిస్తోంది.

అక్కడ మళ్ళీ ఒక్కసారిగా కరోనా కేసుల నమోదు పెరుగుతుంది. గత మూడు నెలల నుంచి తగ్గుముఖం పట్టిన కేసులు మళ్ళీ రోజుకు 50 వేలకు పైగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. రెండ్రోజుల కిందట 57,848 కేసులు నమోదు కాగా.. శుక్ర వారం 51,319 కేసులు, శనివారం 48,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇది కరోనా తగ్గుతుందని భావిస్తున్న భారత్ వంటి దేశాలకు హెచ్చరిక అని అంటున్నారు. ఎందుకంటే మనదేశంలో కరోనా విజృంభణ తగ్గుతుందని ఊపిరిపీల్చుకుంటున్నాం.. అయితే ఇప్పుడు బ్రెజిల్ దేశంలోని పరిస్థితులు మనకు హెచ్చరికలాంటి సందేశాన్ని ఇస్తున్నట్లు లెక్క .. అందుకని మనం కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చిందని భరోసా నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్త పడితే మంచిదని నిపుణులు తెలిపారు.

Also Read:

మహారాష్ట్రలో తగ్గని కరోనా వైరస్ తీవ్రత.. 20 లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య

భారత్‌లో 20 కోట్లు దాటిన కరోనా టెస్టుల సంఖ్య.. మొత్తం ఎన్ని ల్యాబ్‌లు ఉన్నాయో తెలుసా..?