MLA Sunke Ravi Shankar: భవిష్యత్ అంతా విద్యార్థులదే అని టీచర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే సుంకెరవిశంకర్…
కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు విద్యారంగాన్ని కూడా అతలాకుతలం చేసింది. తాజాగా లాక్‌డౌన్ తర్వాత పాఠశాలలు ఓపెన్ కావడంతో ఓ స్కూల్‌కి వెళ్లారు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్...
MLA Sunke Ravi Shankar: కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు విద్యారంగాన్ని కూడా అతలాకుతలం చేసింది. తాజాగా లాక్‌డౌన్ తర్వాత పాఠశాలలు ఓపెన్ కావడంతో ఓ స్కూల్‌కి వెళ్లారు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. పాఠశాలలో కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు. క్లాస్‌రూమ్‌లో శానిటైజర్లు ఉంచాలని, విద్యార్థులు, టీచర్లు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు ఎమ్మెల్యే.
పనిలో పనిగా టీచర్ అవతారమెత్తారు ఎమ్మెల్యే. గతంలో విద్యాసంస్థలను నడిపిన అనుభవం ఉండటంతో మరోసారి చాక్‌పీస్‌తో బ్లాక్‌బోర్డుపై రాస్తూ, విద్యార్థులకు పాఠాలు బోధించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పాఠాలు బోధించారు ఎమ్మెల్యే. భవిష్యత్ అంతా విద్యార్థులదే అన్నారు ఎమ్మెల్యే.
గతంలో విద్యాసంస్థలు నిర్వహించడంతో ఎమ్మెల్యే సుంకెరవిశంకర్‌కు టీచర్‌గా అనుభవం ఉంది. దీంతో స్కూల్ కనిపిస్తే చాలు పాఠాలు బోధిస్తూ, తన పాత రోజులను గుర్తు చేసుకుంటారు. తాజాగా స్కూళ్లు మొదలు కావడంతో అటు విద్యార్థులకు, టీచర్లకు కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూరు ఇటు తనకు తెలిసిన పాత పాఠాలను నెమరువేసుకుంటూ , అప్పుడప్పుడు విద్యార్థులకు బోధిస్తుంటారు ఎమ్మెల్యే. ఇప్పుడు మరోసారి తనలోని టీచర్‌కి పనిచెప్పారు ఎమ్మెల్యే సుంకెరవిశంకర్.
Also Read: