TRS Party Committee Meeting: ఈరోజు మద్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్‌ఎస్ పార్టీ కమిటీ సమావేశం… సర్వత్రా ఉత్కంఠ
ఈరోజు మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి..
TRS Party Committee Meeting: ఈరోజు మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు , రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులు హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ చర్చించనున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారని తెలుస్తోంది. కేటీఆర్ సీఎం అనే అంశం పై కేసీఆర్ ఎం మాట్లాడుతారు..క్లారిటి ఇస్తారా? అనే అంశం పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Also Read: