AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Superstar Rajinikanth: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రానున్న ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు

Superstar Rajinikanth: రానున్న శాసనసభ ఎన్నికల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎవరికీ మద్దతు ఇవ్వరని రజనీ మక్కల్‌ మండ్రం రాష్ట్ర నిర్వాహకుడు సుధాకర్‌ శనివారం ..

Superstar Rajinikanth: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రానున్న ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు
Subhash Goud
|

Updated on: Feb 07, 2021 | 9:05 AM

Share

Superstar Rajinikanth: రానున్న శాసనసభ ఎన్నికల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎవరికీ మద్దతు ఇవ్వరని రజనీ మక్కల్‌ మండ్రం రాష్ట్ర నిర్వాహకుడు సుధాకర్‌ శనివారం తెలిపారు. అనారోగ్య కారణాలతో రజనీకాంత్‌ రాజకీయాలకు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మక్కల్‌ మండ్రం నిర్వాహకులు, అభిమానులు వారికి నచ్చిన పార్టీల్లో చేరవచ్చని మక్కల్‌ మండ్రం తరపున ఆయన ప్రకటించారు. అయితే మక్కల్‌ మండ్రం జిల్లా కార్యదర్శులు, ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ ప్రకటనతో మక్కల్‌ మండ్రం నిర్వాహకులు డీఎంకే, బీజేపీ సహా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీ మక్కల్‌ మండ్రం రాష్ట్ర నిర్వాహకుడు జిల్లా కార్యదర్శులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌ రానున్న ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వరని స్పష్టం చేశారు.

అయితే లతా రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని పేర్కొంటున్నట్లు సమాచారం. అలాగే అర్జున మూర్తి పార్టీ ప్రారంభిస్తే ఆయన పార్టీకి రజనీ మక్కల్‌ మండ్రానికి ఎలాంటి సంబంధం లేదని వివరించారని కార్యదర్శి వెల్లడించారు.

Also Read: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచన చేయండి… ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం వైఎస్‌ జగన్‌‌