AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Postal Circle jobs: తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేవలం టెన్త్ మార్కులతో 3446 పోస్టల్ ఉద్యోగాలు..

తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఏపీ, తెలంగాణలోని 3446 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ప్రకటన వచ్చేసింది ఈ పోస్టులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా..

Postal Circle jobs: తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేవలం టెన్త్ మార్కులతో 3446 పోస్టల్ ఉద్యోగాలు..
Ram Naramaneni
|

Updated on: Feb 07, 2021 | 10:52 AM

Share

Postal Circle jobs: తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఏపీ, తెలంగాణలోని 3446 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ప్రకటన వచ్చేసింది ఈ పోస్టులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. కేవ‌లం టెన్త్ క్లాస్‌ మార్కుల ఆధారంగా భర్తీ చేయనున్నారు.

క్వాలిఫికేషన్ :

బ్రాంచ్ పోస్టుమాస్ట‌ర్‌ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్ట‌ర్‌ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భారత తపాలా విభాగం భర్తీ చేయనుంది. ఏపీలో 2296, తెలంగాణలో 1150 పోస్టులున్నాయి. ఆయా పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు మ్యాథమేటిక్స్, లోకల్ లాంగ్వేజ్, ఇంగ్లిష్ సబ్జెక్టుల‌తో టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. అయితే టెన్త్ క్లాస్ వరకు లోకల్ లాంగ్వేజ్‌లో చదివి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు సర్టిఫికెట్ కూడా పొంది ఉండాలి. ఒకవేళ కంప్యూటర్ కోర్సును ఒక సబ్జెక్టుగా టెన్త్ క్లాసులో చదివితే సర్టిఫికెట్‌తో పనిలేదు. సంబంధిత గ్రామ పరిధిలో నివాసం ఉండాలి.

వయసు:

వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సమర్పించాల్సిన సర్టిఫికెట్లు:

టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ లేదా మార్కుల మెమో సమర్పించాలి. వాటిలో మార్కులు, పాయింట్స్, గ్రేడ్స్ లేకపోతే ఎస్ఎస్‌సీ మార్కులషీట్ ఇవ్వాలి. బర్త్ సర్టిఫికేట్ లేదా సంబంధిత సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. కుల ధృవీకరణ పత్రం ధ్రువ‌ప‌త్రం, కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్, ఫొటో, సంతకం, దివ్యాంగులు సదరం, ట్రాన్స్‌జెండ‌ర్లు సంబంధిత‌ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి.

ఎంపిక విధానం:

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ తయారవుతుంది. కేవలం టెన్త్ క్లాస్‌లో సాధించిన మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.

ఎలా అప్లై చేయాలంటే:

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జనవరి 27, 2021న స్టార్టయ్యింది. ఫిబ్రవరి 26 దరఖాస్తులకు లాస్ట్ డేట్. ఓసీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ పురుష/ ట్రాన్స్-మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళా/ ట్రాన్స్‌మెన్‌, పీడబ్ల్యూడీ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతభత్యాలు సహా పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://appost.in/ విజిట్ చేయండి.

Also Read:

ఎంత విడ్డూరం సుమీ..! సీసీ కెమెరాకు చూపించి మరీ.. లంచం తీసుకుంది… ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Photographer overaction: ఈ వీడియో చూస్తే.. నవ్వుతో మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం.. అతికి అదిరిపోయే దెబ్బ