Rayalaseema Name: ‘రాయలసీమ’ అనే పేరు ఎలా వచ్చింది.. దీనిని ఎవరు ప్రతిపాదించారు..? ఈ పేరుకు ప్రత్యేకత ఏమిటి.?

Rayalaseema Name: 'రాయలసీమ' తెలుగు నేలపై ఈ పేరుకు ప్రత్యేకత ఉంది. సినిమాల ప్రభావంతో ఆ పేరుకు అదనపు హంగులు వచ్చి చేరాయి. కానీ ఇంతకీ ఆ ప్రాంతానికి 'రాయలసీమ' ...

Rayalaseema Name: 'రాయలసీమ' అనే పేరు ఎలా వచ్చింది.. దీనిని ఎవరు ప్రతిపాదించారు..? ఈ పేరుకు ప్రత్యేకత ఏమిటి.?
Follow us

|

Updated on: Feb 07, 2021 | 11:10 AM

Rayalaseema Name: ‘రాయలసీమ’ తెలుగు నేలపై ఈ పేరుకు ప్రత్యేకత ఉంది. సినిమాల ప్రభావంతో ఆ పేరుకు అదనపు హంగులు వచ్చి చేరాయి. కానీ ఇంతకీ ఆ ప్రాంతానికి ‘రాయలసీమ’ పేరు ఎప్పుడు వచ్చింది..? ఎలా వచ్చింది..? అనేది పెద్దగా తెలుసుకొని ఉండము. అయితే గత చరిత్ర ప్రకారం.. 90 ఏళ్ల క్రితం వరకు ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు లేదట. అంతకు ముందు ప్రస్తుతం చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలు, ప్రకాశం జిల్లాలోని కంభం, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలను, కర్ణాటకలోని బళ్లారి, తుముకూరు, దావణగేరి ప్రాంతాలను ‘దత్త’ మండలం అని పిలిచేవారట. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలనే ఉద్దేశంతో ఆంధ్ర మహాసభలు జరిగాయి. కాగా, 1928 నవంబర్‌ 17,18 తేదీల్లో ఆంధ్ర మహాసభల్లో భాగంగా సీడెన్‌ జిల్లాల సమావేశాలు నంద్యాలలో జరిగాయి.

సీడెన్‌ లేదా దత్త మండలం అన్న పదం బానిసత్వాన్ని సూచిస్తూ అవమానకరంగా ఉందనే ఉద్దేశంతో దీనిని మార్చాలని సమావేశంలో ప్రతిపాదనలు వచ్చాయి. అనంతపురం జిల్లాకు చెందిన చిలుకూరి నారాయణరావు సీడెన్‌ బదులు రాయలసీమ అన్న పేరు వాడుకలోకి తీసుకురావాలని ప్రతిపాదన చేశారు. ఇక బళ్లారి, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు ప్రాంతాలను రాలయసీమగా పిలవాలని ఆ సభల్లో తీర్మానం చేశారు. అయితే నిజానికి రాలయసీమకు ఈ పేరు పెట్టింది స్వతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు అనుకునేవారు. కానీ 1928, నవంబర్‌ 17,18 తేదీల్లో ఆంధ్ర మహాసభల్లో భాగంగా దత్త మండలం సమావేశం కూడా జరిగాయి. కడప కోటిరెడ్డి దానికి అధ్యక్షులుగా ఉన్నారు. చిలుకూరు నారాయణరావు కూడా అందులో ఉన్నారు. ఈ ప్రాంతానికి దత్త మండలం కాకుండా ఇంకేదైనా పేరు పెట్టాలన్న చర్చ వచ్చినప్పుడు ‘రాయలసీమ’ అనే పేరు ప్రతిపాదించారు నారాయణరావు. పప్పూరి రామాచార్యాలు ఆ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. 1946 జనవరి 3న రాయలసీమ భాషాసంపద పేరుతో తాను చేసిన రేడియో ప్రసంగంలో ఈ విషయాన్ని నారాయణరావు వివరించారు. రాయలసీమకు ఆ పేరు పెట్టినందుకు గర్విస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

‘సీడెన్’‌ అంటే ఏమిటి..?

ఇంగ్లీష్ లో ఒక ప్రాంతాన్ని, ప్రాంతంపై అధికారాన్ని బదిలీ చేయడాన్ని సీడెన్‌ అంటారు. విజయనగర సామ్రాజ్యం పతనం అయ్యాక 1792 వరకూ ఈ ప్రాంతం రకరకాల రాజులు, వంశాలు, సామంతుల పాలనలో ఉండేది. 1792లో మూడో మైసూరు యుద్ధం ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంతం నిజం రాజుకు వచ్చింది. అక్కడి నుంచి 1800 వరకూ రాయలసీమ నిజం రాజుల పాలనలో ఉండేది. ఆ తర్వాత మరాఠాలు, టిప్పు సుల్తాన్‌ నుంచి దాడులు ఎదర్కొన్న అప్పటిరెండో నిజాం రాజు, బ్రిటిష్‌ సైన్యం సహాయం కోరాడు. బ్రటిష్‌ వారికి దత్తత ఇచ్చారు. దీనిని బ్రిటిష్‌ వారు అప్పటి మద్రాస్‌ రాష్ట్రంలో కలిపి సీడెన్‌ అని పిలవడం ప్రారంభించారు. ఇది 1800 సంవత్సరంలో జరిగింది. సీడెన్‌ జిల్లాలను తెలుగులో దత్త మండలాలుగా వ్యవహరించేవారు.

1953 వరకు మద్రాస్‌ రాష్ట్రంలో, 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రంలో, 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న రాయలసీమ ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భాగంగా ఉంది. కానీ 1953కు ముందున్న రాయలసీమ ఇప్పుడు చాలా కుదించుకుపోయింది. 1953 వరకూ రాయలసీమలో ఉన్న బళ్లారి, తుముకూరు, దావనగేరే ప్రాంతాలు కర్ణాటకలో కలిశాయి. 1970లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు తాలుకాలను తీసుకువచ్చి ప్రకాశం జిల్లాలో కలిపేశారు. ఇప్పటికీ ప్రకాశం జిల్లా కోస్తా-సీమ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ప్రాంతాలు విడిపోవడంతో  ఈ విధంగా ‘రాలయసీమ’ అనే పేరు వచ్చింది.

Also Read: Superstar Rajinikanth: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రానున్న ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు