CM Jagan, Ganta Srinivasa Rao: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన గంటా శ్రీనివాసరావు
CM Jagan, Ganta Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఆయన...
CM Jagan, Ganta Srinivasa Rao:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఆయన ట్విట్టర్ ద్వారా జగన్ గురించి ట్వీట్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు సలహాలు, పరిష్కారాలతో ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాయడం తాను ఆహ్వానిస్తున్నానని అన్నారు. సొంత ఇనుము ఖనిజం గనిని కేటాయించడం, రుణాలను ఈక్విటీలుగా మార్చడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజీలో నమోదై నిధుల సేకరణకు అవకాశం ఉండటం లాంటివి పరిష్కార మార్గాలన్నింటినీ లేఖలో ప్రస్తావించిన సీఎం జగన్‌కు గంటా ధన్యవాదాలు తెలిపారు.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాలసీ తీసుకున్నందున లేఖతో పాటు జగన్ స్వయంగా వెళ్లి ప్రధాని నరేంద్రమోదీని కలిసి వైజాగ్ స్టీల్ ఏర్పాటు ఉద్యమాన్ని సైతం వివరించాలని ఈ సందర్భంగా గంటా కోరారు. విశాఖ , తెలుగు ప్రజల మనోభావాలను వివరించి ప్రధాని మోదీని ఒప్పించాలన్నారు. అలాగే అవసరమైతే అఖిల పక్షాన్ని కూడా తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ట్విట్టర్‌లో గంటా శ్రీనివాస్ కోరారు.
వైజాగ్ స్టీల్స్ పునరుద్దరణ కోసం కీలకమైన సలహాలు, పరిష్కారాలతో గౌరవ @AndhraPradeshCM శ్రీ @ysjagan గారు, గౌరవ @PMOIndia శ్రీ @narendramodi గారికి లేఖ రాయడాన్ని ఆహ్వానిస్తున్నాం. pic.twitter.com/4vfwZgI2aZ
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) February 7, 2021