AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photographer overaction: ఈ వీడియో చూస్తే.. నవ్వుతో మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం.. అతికి అదిరిపోయే దెబ్బ

  ఏదైనా అకేషన్ జరిగితే ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంచుకోవడానికి ఫోటోలు, వీడియోలు తీసుకుంటాం. ప్రజంట్ పేదింటివారు కూడా కాస్త ఖర్చు ఎక్కువైనా సరే..

Photographer overaction: ఈ వీడియో చూస్తే.. నవ్వుతో మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం.. అతికి అదిరిపోయే దెబ్బ
Ram Naramaneni
| Edited By: Team Veegam|

Updated on: Feb 08, 2021 | 3:58 PM

Share

Photographer overaction:  ఏదైనా అకేషన్ జరిగితే ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంచుకోవడానికి ఫోటోలు, వీడియోలు తీసుకుంటాం. ప్రజంట్ పేదింటివారు కూడా కాస్త ఖర్చు ఎక్కువైనా సరే.. ఫంక్షన్ ఏమైనా ఉంటే ఫోటోలు, వీడియోలు తీయిస్తున్నారు. అయితే ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్స్ పేరుతో కాస్త అతిగా కూడా ప్రవర్తిస్తున్నారు కొందరు. వారి సంగతి ఇప్పుడెందుకులే కానీ.. అతిగా ప్రవర్తించి వరుడి చేతిలో దెబ్బలు తిన్న ఓ ఫోటోగ్రాఫర్ సంగతి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఓ పెళ్లిలో వరుడు, వధువు స్టేజ్‌పై నిల్చుని ఉన్నారు. ఫోటోగ్రాఫర్ వారిని ఫోటోలు తీస్తూ ఉన్నాడు. అయితే అతడు వరుడ్ని సైడ్ చేసి.. వధువుపై ఫోకస్ పెట్టాడు. బహుశా వధువు తరుఫున వాళ్లు అతడ్ని పెట్టుకుని ఉండొచ్చు. అయితే మరీ అతి చేస్తే పెళ్లి కొడుక్కి మండుతుంది కదా. అందుకే చూసినంతసేపు చూశాడు. మరీ ఓవర్ చేస్తూ .. పెళ్లి కూతురు ముఖాన్ని సరిచేస్తోన్న సమయంలో లాగి పెట్టి ఒక్కటి ఇచ్చాడు. ఇకడ్నుంచి వెళ్లిపో అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో అప్పటివరకు సిగ్గుతో తల దించుకున్న వధువు.. పగలబడి నవ్వేసింది. కొసమెరుపు ఏంటంటే.. దెబ్బలు తిన్న ఫోటోగ్రాఫర్ కూడా నవ్వులు చిందించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

Also Read:

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి అకౌంట్‌ ఓపెన్‌ చేయడం ఎలా.. ? అందులో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడం ఎలా?

AP IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్​లను బదిలీ సర్కార్ ఉత్తర్వులు.. వివరాలు ఇవిగో

World’s Costliest Crop: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కను పండిస్తున్న బీహార్ వాసి.. కిలోకి లక్ష ఆదాయం