AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World’s Costliest Crop: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కను పండిస్తున్న బీహార్ వాసి.. కిలోకి లక్ష ఆదాయం

ఎండనక వాననక శ్రమిస్తూ పదిమందికి అన్నం పెట్టి.. తను మాత్రం అన్నం కోసం అల్లాడే వాడు అన్నదాత. సాంప్రదాయ పంటలను, కూరగాయలను పండిస్తూ.. రైతులు లాభాల కోసం ఎదురుచూసే రోజులు పోయాయి...

World's Costliest Crop: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కను పండిస్తున్న బీహార్ వాసి.. కిలోకి లక్ష ఆదాయం
Surya Kala
|

Updated on: Feb 05, 2021 | 1:08 PM

Share

World’s Costliest Crop: ఎండనక వాననక శ్రమిస్తూ పదిమందికి అన్నం పెట్టి.. తను మాత్రం అన్నం కోసం అల్లాడేవాడు అన్నదాత. సాంప్రదాయ పంటలను, కూరగాయలను పండిస్తూ.. రైతులు లాభాల కోసం ఎదురుచూసే రోజులు పోయాయి. కొంత మంది రైతులు ముందుగానే మార్కెట్‌ను అధ్యయనం చేసి అందుకు తగిన విధంగా వ్యవసాయాన్ని చేస్తూ.. లాభాలను ఆర్జిస్తున్నారు. మరోవైపు వివిధ రకాల పంటలను సేంద్రీయ పద్ధతితో పాటు.. ఆధునిక పద్ధతుల్లో పండిస్తూ అన్నదాత ఆర్ధికంగా ఎదుగుతున్నాడు.. తాజాగా బీహార్ కు చెందిన ఓ రైతు కూడా సరిగ్గా మార్కెట్‌కు ఏమి కావాలో తెలుసుకుని అదే పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. అతను పండించే పంటతో ఏకంగా కిలో. రూ. లక్ష ఆదాయం ఆర్జిస్తున్నాడు. మరి ఆ రైతును కిలోతోనే లక్షాధికారి చేస్తోన్న ఆ పంట ఏమిటి.? ఎక్కడ పండిస్తున్నారో తెలుసుకుందాం..!

బీహార్లోని ఔరంగాబాద్‌లో ఉన్న నవీనగర్‌ బ్లాక్‌ కరండిహ్‌ గ్రామానికి చెందిన ఆమ్రేష్(38) డిఫరెంట్ పద్దతిలో వ్యవసాయం చేయాలనుకున్నాడు. అమ్రేష్‌ చదివింది ఇంటర్ అయితేనేమి వ్యవసాయాన్ని దండగకాదు.. పండగ అనుకునే చేయాలనుకున్నాడు.  పంటల్లో లాభసాటివి ఏమిటో అద్యయనం చేశాడు . దీంతో విదేశాల్లో డిమాండ్ ఉన్న పంట తన పొలంలో పండుతుందని అంచనా వేసుకున్నాడు. దీంతో ఐరోపా దేశాల్లో మంచి గిరాకీ‌ ఉన్న హాప్‌ షూట్స్‌ అనే ఓ రకమైన మూలికల జాతికి చెందిన కూరగాయను పండిస్తున్నాడు. అయితే మొదట్లో అమ్రేష్‌ ఈ పంటను వేసినప్పుడు చూసిన వారంతా పిచ్చి పని చేస్తున్నాడని అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసే సరికి అవాక్కయ్యారు.

ఔషధాల తయారీలో వాడే ఈ మొక్కకు మంచి ధర పలుకుతుంది:

హాప్‌ షూట్స్‌ మొక్క ఆకులు, పువ్వులు, కాయలను యాంటీ బయోటిక్స్‌ తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొక్కలోని ప్రతి భాగం ఔషధ గుణాలు కలిగి ఉంది. ఈ మొక్క తో బీర్‌ను తయారు చేస్తారు. ముఖ్యంగా టీబీ చికిత్సకు ఉపయోగించే ఔషధాల్లో ఉపయోగిస్తారు. అందుకనే ఈ పంటకు ఖరీదు చాలా ఎక్కువ. ఈ పంటను తనకు సాగు చేయమని వారణాసిలోని ఇండియన్‌ వెజిటబుల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ లాల్‌ సజెస్ట్ చేశారని ఆమ్రేష్ చెప్పాడు. ఇప్పుడు ఈ పంట పెరుగుదల ఆ పరిసర ప్రాంతాల్లో విజయవంతం కావడంతో గ్రామంలోని మిగతా రైతులు కూడా హాఫ్ షూట్స్ ను పెంచడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో అక్కడ రైతుల ముఖ చిత్రం త్వరలో మారనుంది.

Also Read:

దేశంలో అత్యంత బ్రాండ్‌ విలువ ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..? నాలుగోసారి నెం1గా నిలిచిన..

బడ్జెట్‌ 2021 లో తెచ్చిన నిబంధనల మార్పు తర్వాత కూడా వీపీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టాలా?