AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Land Issue: అయోధ్యలో ఆ భూమి మాదే.. అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటీషన్..

Ayodhya Land Issue: అయోధ్య వివాదం సమసిపోయిందనుకున్న తరుణంలో మరో వాదన తెరమీదకు వచ్చింది. అయోధ్యలో మసీదు నిర్మాణాని కేటాయించిన

Ayodhya Land Issue: అయోధ్యలో ఆ భూమి మాదే.. అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటీషన్..
Shiva Prajapati
|

Updated on: Feb 05, 2021 | 5:51 AM

Share

Ayodhya Land Issue: అయోధ్య వివాదం సమసిపోయిందనుకున్న తరుణంలో మరో వాదన తెరమీదకు వచ్చింది. అయోధ్యలో మసీదు నిర్మాణాని కేటాయించిన ఐదు ఎకరాల స్థలం తమదేనంటూ ఇద్దరు మహిళలకు ముందుకు వచ్చారు. అక్కా చెల్లెళ్లు అయిన ఈ మహిళలు.. అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశ విభజన సమయంలో తమ తండ్రి భారత్‌కు వచ్చారని, యూపీలోని ఫైజాబాద్‌లో స్థిరపడ్డారని మహిళలు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ సందర్భంగా అధికారులు తమ తండ్రికి 28 ఎకరాల భూమిని కేటాయించినట్లు పేర్కొన్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ.. కొంతకాలం తరువాత భూమిపై హక్కుదారుడిగా ఉన్న తమ తండ్రి పేరును రెవెన్యూ రికార్డుల్లో నుంచి తొలగించారని పిటిషనర్లు కోర్టుకు వివరించారు.

దీనిపై పై అధికారులకు ఫిర్యాదు చేయగా.. తమకు సంబంధించిన 28 ఎకరాల నుంచి 5 ఎకరాలను సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించినట్లు తెలిసిందన్నారు. తమకు న్యాయం చేయాలని కోర్టును వారు అభ్యర్థించారు. కాగా, ఏళ్ల తరబడి నలిగిన అయోధ్య సమస్యకు భారత సుప్రీంకోర్టు ముగింపు పలికిన విషయం తెలిసిందే. అయోధ్య శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు.. అదే ప్రాంతంలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాలు కేటాయించాల్సిందిగా ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు మసీదుకు స్థలం కేటాయించడంతో పాటు.. మసీదు నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. మరోవైపు అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి.

Also read:

Fake WhatsApp Version: తస్మాత్ జాగ్రత్త.. చక్కర్లు కొడుతున్న నకిలీ వాట్సప్‌.. ఇన్‌స్టాల్ చేసుకున్నారో అంతే సంగతులు..

Britain Government: చైనాకు ఊహించని ఝలక్ ఇచ్చిన బ్రిటన్ ప్రభుత్వం.. అసలేం జరిగిందంటే..