Britain Government: చైనాకు ఊహించని ఝలక్ ఇచ్చిన బ్రిటన్ ప్రభుత్వం.. అసలేం జరిగిందంటే..
Britain Government: అసలే ఆ రెండు దేశాల మధ్య అంతంత మాత్రం దౌత్య సంబంధాలు.. అందులోనూ చైనాకు వరుస షాక్‌లు ఇస్తోంది బ్రిటన్ ప్రభుత్వం.
Britain Government: అసలే ఆ రెండు దేశాల మధ్య అంతంత మాత్రం దౌత్య సంబంధాలు.. అందులోనూ చైనాకు వరుస షాక్‌లు ఇస్తోంది బ్రిటన్ ప్రభుత్వం. తాజాగా ఓ ఛానల్ ప్రసారాల వ్యవహారంలో చైనాకు బ్రిటన్ ఊహించిన ఝలక్ ఇచ్చింది. చైనా ప్రభుత్వం మద్దతు ఉందని భావిస్తున్న సీజీటీఎన్ ఛానెల ప్రసారాలను నిలిపివేస్తూ బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. చైనాకు చెందిన సీజీటీఎన్ ఛానెల్ బ్రిటన్‌లో ప్రసారానుమతులు పొందింది. ఆ దేశంలో కొంతకాలంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఆ ఛానెల్ సంపాదకీయ బాధ్యతలు సరిగా నిర్వహించడం లేదంటూ బ్రిటన్ మీడియా నియంత్రణ సంస్థ ఆరోపించింది.
ఈ క్రమంలో తాజాగా ఆ ఛానెల్ ప్రసారాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు.. ఈ సంపాదకీయ బాధ్యతలను ఛానెల్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే కమిటీకి బదిలీ చేసేందుకు కూడా బ్రిటన్ మీడియా నియంత్రణ సంస్థ నిరారకరించింది. దీనికి కూడా ఓ కారణం ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ ఛానెల్ ప్రసారాలపై చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ నియంత్రణ ఉందని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోందట. ఈ కారణంగానే అనుమతుల బదిలీకి నో చెప్పిందట. ఇదిలాఉంటే.. బ్రిటన్ తీసుకున్న ప్రస్తుత నిర్ణయంపై చైనా ప్రభుత్వం తాజాగా స్పందించకపోయినప్పటికీ.. గతంలో అనేకసార్లు తీవ్ర ఆరోపణలు చేసింది. చైనా మీడియాను అడ్డుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ గతంలో పలుమార్లు ఆరోపించింది. మరి తాజా చర్యపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also read:
TSRTC Employees: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో ఉద్యోగ భద్రత మార్గదర్శకాలపై సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. Fake WhatsApp Version: తస్మాత్ జాగ్రత్త.. చక్కర్లు కొడుతున్న నకిలీ వాట్సప్.. ఇన్‌స్టాల్ చేసుకున్నారో అంతే సంగతులు..