Dog and Horse Friendship: గుర్రాన్ని వాకింగ్‌కు తీసుకెళ్లిన కుక్కపిల్ల.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో..

Dog and Horse Friendship: సాధారణంగా ప్రజలు తమ పెంపుడు కుక్కలను, కుక్క పిల్లలను వాకింగ్‌కు తీసుకెళ్లడం అనేక సందర్భాల్లో చూశాం.

Dog and Horse Friendship: గుర్రాన్ని వాకింగ్‌కు తీసుకెళ్లిన కుక్కపిల్ల.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 05, 2021 | 5:02 AM

Dog and Horse Friendship: సాధారణంగా ప్రజలు తమ పెంపుడు కుక్కలను, కుక్క పిల్లలను వాకింగ్‌కు తీసుకెళ్లడం అనేక సందర్భాల్లో చూశాం. కానీ.. రివర్స్‌గా కుక్క పిల్లే వాకింగ్‌కు తీసుకెళ్తే!.. అది కూడా మనిషిని కాకుండా, ఓ గుర్రాన్ని వాకింగ్‌కు తీసుకెళ్తే!. ఇక్కడ ఓ కుక్క పిల్ల అదే పని చేసింది. ఓ కుక్క పిల్ల.. గుర్రాన్ని తన వెంట వాకింగ్‌కి తీసుకెళ్లింది. గుర్రానికి ఉన్న కళ్లాన్ని పట్టుకుని నడిపించింది. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఈ కుక్క పిల్ల, గుర్రానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి గుర్రాల ఫామ్ ఉంది. అతను గుర్రాలకు తోడు ఓ కుక్క పిల్లను కూడా పెంచుకుంటున్నాడు.

సదరు వ్యక్తి రోజూ ఉదయం కుక్క పిల్లను గుర్రాల ఫామ్ వద్దకు తీసుకువెళ్లేవాడు. అయితే, ఆ గుర్రాల ఫామ్‌లో పది నెలల గుర్రం పిల్ల కూడా ఉంది. ఈ క్రమంలో అటు కుక్క పిల్ల, ఇటు గుర్రం పిల్ల మధ్య స్నేహం కుదిరింది. కుక్క పిల్లను గుర్రాల ఫామ్‌ వద్దకు తీసుకెళ్లాగానే.. ఆ గుర్రం పిల్ల, కుక్క పిల్ల రెండూ కలిసి ఆడుకునేవి. ఇలా వీటి స్నేహం రోజు రోజుకు మరింత పెరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల కుక్కపిల్ల, గుర్రం పిల్ల రెండు కలిసి సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. గుర్రానికి ఉన్న కళ్లాన్ని కుక్కపిల్ల నోట కరుచుకుని రోడ్డుపై వాకింగ్‌కు తీసుకెళ్లింది. ఈ సీన్‌ను అంతా సదరు యజమాని తన ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియో కాస్తా ఇప్పుడు అంతర్జాలంలో హల్‌చల్ చేస్తోంది. కుక్కపిల్ల, గుర్రం వాకింగ్‌పై నెటిజన్లు తమైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

Bollywood Stars War: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ తారల మధ్య మాటల యుద్ధం..

Social Media War: కోహ్లీ ట్వీట్.. తీవ్రంగా మండిపడ్డ నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!