AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood Stars War: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ తారల మధ్య మాటల యుద్ధం..

Bollywood Stars War: రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల అమెరికన్ పాప్ సింగర్ రిహన్నా చేసిన ఒక్క ట్వీట్.. భారత్‌లో అమాంతం హీట్‌ను పెంచింది.

Bollywood Stars War: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ తారల మధ్య మాటల యుద్ధం..
Shiva Prajapati
|

Updated on: Feb 05, 2021 | 4:52 AM

Share

Bollywood Stars War: రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల అమెరికన్ పాప్ సింగర్ రిహన్నా చేసిన ఒక్క ట్వీట్.. భారత్‌లో అమాంతం హీట్‌ను పెంచింది. బాలీవుడ్ స్టార్‌ల మధ్య సోషల్ మీడియా వార్‌కు తెరలేపింది. రిహన్నా ట్వీట్‌కు బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఫస్ట్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఒక్కొక్కరు ఆమె ట్వీట్‌కు కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టారు. సినీ స్టార్స్ మొదలు.. స్పోర్ట్స్ స్టార్లు, రాజకీయ ప్రముఖల వరకు అందరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే ఇదే సమయంలో రిహన్నాకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలిపారు. అందులో తాప్సీ పన్ను ముందు వరుసలో ఉందని చెప్పాలి.

ఇదిలాఉంటే.. ఈ వ్యవహారంలోనే అటు కంగనా, ఇటు తాప్సీ మధ్య ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. రిహన్నాకు కంగనా ఇచ్చిన కౌంటర్‌పై నటి తాప్సీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘ఒక ట్వీట్‌ మీ ఐక్యతను దెబ్బతీస్తే.. ఒక జోక్‌ మీ విశ్వాసాన్ని సడలింపజేస్తే.. ఒక ప్రదర్శన మత విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని భావిస్తే ముందుగా మీరు మీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. అంతేతప్ప.. ప్రాపంగాండపై ఇతరులకు లెక్చర్ ఇచ్చే టీచర్‌గా మారొద్దు’ అంటూ తాప్సీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

కాగా, ఈ ట్వీట్‌పై కంగనా అంతే స్థాయిలో ఘాటుగా స్పందించింది. ‘బీ గ్రేడ్‌ మనుషులకు బీ గ్రేడ్‌ ఆలోచనలే వస్తాయి. ఒకరి విశ్వాసం అనేది మాతృభూమి, కుటుంబం కోసం నిలబడటంపై ఉంటుంది. ఇది కర్మ లేక ధర్మ ఫలంగా వస్తుంది తప్ప ఉచిత సలహాలను వినొద్దు. వాటి వల్ల దేశానికి ఏమాత్రం ఉపయోగం ఉండదు. అందుకే నేను వారిని బి గ్రేడ్ అని పిలుస్తాను’ అంటూ తాప్సీపై పరోక్షంగా కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

అయితే, వీరిద్దరి ట్వీట్లను ఓ నెటిజన్ స్క్రీన్ షాట్‌ ద్వార మిక్స్ చేసి షేర్ చేశాడు. వీరి ట్వీట్లు విద్వేష పూరితంగా కాకుండా సరదాగా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో తన ట్వీట్‌కు తాప్సీని, కంగనాను ట్యాగ్ చేశాడు సదరు నెటిజన్. దాంతో తాప్సీ మరోసారి స్పందించింది. ‘ఆ విధ్వేష భావజాలం ప్రాథమికంగా వారి డీఎన్‌ఏలోనే ఉండోచ్చు లేదా ఆర్‌ఎన్‌ఏ?.. ప్లేట్‌లెట్స్‌పై కూడా’ అంటూ కంగనాను ఉద్దేశించి కామెంట్స్ చేసింది తాప్సీ.

Tapsee Tweet:

Also read:

Donation for Ram Mandir: అయోధ్య రామాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే సహా టీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ నేత భారీ విరాళం. Realme Smart Phones: సరికొత్త ఫీచర్లతో భారత మార్కెట్‌లోకి విడుదలైన రియల్‌మీ 5జీ స్మార్ట్‌ ఫోన్లు.. ధర ఎంతంటే..