Kangana Tweet: రోహిత్ శర్మ ట్వీట్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కంగనా.. పోస్ట్ తొలగించిన ట్విట్టర్ యాజమాన్యం…
Twitter Delete kangana Tweet: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ గత కొన్ని రోజులగా రైతులు భారీ ఎత్తున ఢిల్లీలో చేపడుతోన్న ఉద్యమం రోజుకో మలుపు తిరుగుతోంది...
Twitter Delete kangana Tweet: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ గత కొన్ని రోజులగా రైతులు భారీ ఎత్తున ఢిల్లీలో చేపడుతోన్న ఉద్యమం రోజుకో మలుపు తిరుగుతోంది. రైతులు చేస్తోన్న ఉద్యమంపై సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రముఖులు స్పందిస్తున్నారు.
India has always been stronger when we all stand together and finding a solution is the need of the hour. Our farmers play an important role in our nation’s well being and I am sure everyone will play their roles to find a solution TOGETHER. #IndiaTogether ??
— Rohit Sharma (@ImRo45) February 3, 2021
ఈ నేపథ్యంలో పాప్ స్టార్ రిహన్నా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్త్‌తో పాటు పలువురు రైతుల ఆందోళనపై స్పందించారు. ఇక ఈ నేపథ్యంలో క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రైతుల ఉద్యమంపై రోహిత్ శర్మ కూడా ఓ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌లో రోహిత్.. ‘మనమంతా కలిసికట్టుగా ఉన్నప్పుడు భారత్ బలంగా ఉంటుంది. రైతుల సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన తరుణం ఇది. దేశ ప్రగతిలో రైతులు కీలక భూమిక పోషిస్తున్నారు. అందరం కలిసి ఈ సమస్యకో పరిష్కారం కనుగొనడంలో అందరు తమ తమ పాత్రలను పోషిస్తారని ఆశిస్తున్నాను. ఐక్య భారత్’ అంటూ రాసుకొచ్చాడు.
ఇక రోహిత్ చేసిన ఈ ట్వీట్‌పై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పందిస్తూ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘ఈ క్రికెటర్లందరూ దోబీ దగ్గర కుక్కల్లా ఎందుకు మొరుగుతున్నారు. అటు ఇంటికి కాకుండా.. ఇటు ఘాట్‌కు కాకుండా. రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చిన విప్లవాత్మక చట్టాలకు రైతులే ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు?’ అంటూ కామెంట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌ను గమనించిన ట్విట్టర్ యాజమాన్యం వెంటనే ట్వీట్‌ను తొలగించింది. మరి ఈ వివాదం ఇంకా ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.