Parliament: రాహుల్ గాంధీతో సమావేశమైన పలు పార్టీల ఎంపీలు.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ..!
Opposition MPs meet Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో విపక్ష పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో..

Opposition MPs meet Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో విపక్ష పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారంతా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారంతా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. డీఎంకే, శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సీపీఐ, ఏఐయూడీఎఫ్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) పార్టీలకు చెందిన ఎంపీలు రాహుల్‌తో భేటీ అయ్యారు.
రైతుల ఆందోళన, వ్యవసాయ చట్టాలపై గురువారం కూడా పార్లమెంట్‌లో ఆందోళనలు జరిగాయి. విపక్షాలు వినకపోవడంతో లోక్‌సభ పలు మార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో సాయంత్రం వేళ పార్లమెంట్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త వ్యవసాయ చట్టాలు, ఢిల్లీలో రైతుల ఆందోళనలు, తదితర అంశాలపై అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.
Delhi: A meeting of leaders from DMK, Shiv Sena, AIUDF, CPI(M), CPI, IUML, Kerala Congress (M), Viduthalai Chiruthaigal Katchi (VCK), Aam Aadmi Party (AAP) with Congress leader Rahul Gandhi is underway at Congress Parliamentary party Office. pic.twitter.com/SLN2ptQcu4
— ANI (@ANI) February 4, 2021
Also Read:




