Gas Subsidy: ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్.? ఇకపై గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ కట్.!

Central Government: ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుందా.? ఇకపై గ్యాస్ సబ్సిడీ లభించదా.? అంటే ఈ ప్రశ్నలకు అవుననే సంకేతాలు...

Gas Subsidy: ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్.? ఇకపై గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ కట్.!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 05, 2021 | 6:40 AM

Central Government: ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుందా.? ఇకపై గ్యాస్ సబ్సిడీ లభించదా.? అంటే ఈ ప్రశ్నలకు అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. 2021-22 బడ్జెట్‌లో పెట్రోలియం సబ్సిడీ కోసం కేంద్ర రూ. 12,995 కోట్లు కేటాయించింది. 2019-20 సంవత్సరంలో కేటాయించిన నిధుల(రూ. 40 వేల కోట్లు) కంటే చాలా తక్కువ. ఈ చర్య వల్ల కిరోసిన్, గ్యాస్ సబ్సిడీని భారీగా తగ్గించడం లేదా మొత్తం సబ్సిడీని ఎత్తేయడం జరుగుతుందని అధికారిక వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

కేంద్ర ప్రభుత్వం ఉజ్వలా స్కీంపై ఎక్కువ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పధకం ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు సబ్సిడీతో కూడిన ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్, సిలిండర్‌ లభిస్తోంది. దీని ద్వారా ఎనిమిది కోట్ల మంది వినియోగదారులు లబ్ది పొందుతున్నారు. కాగా, ప్రస్తుతం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పధకం కింద కేంద్రం అల్పాదాయ వర్గాలకు ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీని ఇస్తున్నారు. ఇక భారతదేశంలో సుమారు 28 కోట్ల ఎల్‌పిజి వినియోగదారులు ఉన్నారు. వీరిలో సుమారు 1.5 కోట్ల మంది సబ్సిడీకి అనర్హులు. వార్షిక ఆదాయం రూ .10 లక్షలకు మించి ఉన్నవారికి ఈ సబ్సిడీని కట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే తాజా బడ్జెట్ కేటాయింపులు దాదాపు 20 కోట్ల మంది గ్యాస్ సబ్సిడీ పొందే లబ్దిదారులపై ఎఫెక్ట్ పడనుంది.

మరిన్ని చదవండి:

మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్‌ ప్రకారమే..

టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!