GATE 2021: గేట్ పరీక్షకు సర్వం సిద్ధం.. అభ్యర్థులు తప్పకుండా పాటించాల్సిన సూచనలివే..
GATE 2021 Begins From Today Instructions For Candidates: కరోనా ప్రభావం క్రమేణా తగ్గుతుండడంతో విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయి. ఇక పరీక్షలు కూడా నిర్వహించడానికి సంబంధిత బోర్డులు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే గేట్ 2021...
GATE 2021 Begins From Today Instructions For Candidates: కరోనా ప్రభావం క్రమేణా తగ్గుతుండడంతో విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయి. ఇక పరీక్షలు కూడా నిర్వహించడానికి సంబంధిత బోర్డులు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే గేట్ 2021 పరీక్షల ప్రక్రియ నేటి నుంచి (శుక్రవారం) నుంచి ప్రారంభంకానుంది. ఐఐటీ ముంబై నిర్వహిస్తున్న ఈ పరీక్ష ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు విడతల వారీగా నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్ష హాల్ టికెట్లను అభ్యర్థుల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. నిజానికి గేట్ పరీక్షలు ఫిబ్రవరి 6 నుంచి మొదలుకానుండగా.. ఫిబ్రవరి 5న మాక్ టెస్ట్‌తో పాటు ఇన్విజిలేటర్స్‌కు సూచనలు, పరీక్ష కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తారు.
గేట్ అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు..
* అభ్యర్థులు సంబంధిత పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి.
* పరీక్షకేంద్రం ముందు క్యూ పద్ధతి పాటించడంతోపాటు, సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు ఏర్పాటు చేసిన ఫ్లోర్ మార్క్స్‌ను పాటించాలి.
* ఒకవేళ అభ్యర్థి శరీర ఉష్ణోగ్రత 99.4 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే.. సెంటర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్‌లో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
* అభ్యర్థులతో పాటు మాస్కులు, గ్లౌజ్‌లు, హ్యాండ్ శానిటైజర్, పెన్ను, హాల్ టికెట్, పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్‌ను అనుమతిస్తారు.
* పరీక్ష ముగిసన తర్వాత సెంటర్‌లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లో హాల్ టికెట్, రఫ్ పేపర్‌ను వేయాలి.
* భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి.
Also Read: Central Government: సామాన్యులకు కేంద్రం మరో షాక్.? గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ కట్.!