Social Media War: కోహ్లీ ట్వీట్.. తీవ్రంగా మండిపడ్డ నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే..

Social Media War: రైతుల ఉద్యమంపై అమెరికాకు చెందిన సింగర్ చేసిన ఒక్క ట్వీట్.. భారత్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు రైతులు..

Social Media War: కోహ్లీ ట్వీట్.. తీవ్రంగా మండిపడ్డ నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 05, 2021 | 4:57 AM

Social Media War: రైతుల ఉద్యమంపై అమెరికాకు చెందిన సింగర్ చేసిన ఒక్క ట్వీట్.. భారత్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు రైతులు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం అన్నట్లుగా వాతావరణం ఒక్కసారిగా పొలిటికల్ వార్‌గానే కాకుండా.. సెలెబ్రిటీ వార్‌గా మారిపోయింది. ‘మనం ఎందుకు దీనిపై మాట్లాడకూడదు’ అంటూ భారత్‌లో రైతు ఉద్యమాన్ని ఉద్దేశించి అమెరికా పాప్ సింగ్ రిహన్నా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌పై తొలుత బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఆమె స్పందన తరువాత ఒక్కొక్కరుగా సెలెబ్రిటీలు స్పందించండం ప్రారంభించారు. సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు రిహాన్నా ట్వీట్‌ను ఖండిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అదే సమయంలో రాజకీయ నాయకులూ ఆమె ట్వీట్‌పై ఘాటుగా స్పందించారు. ఈక్రమంలోనే తాజా టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు.

భారతదేశం ఐకమత్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరంటూ పేర్కొన్నాడు. ‘విభేదాలు తలెత్తినప్పుడే మనమంతా ఐకమత్యంగా ఉండాలి. రైతులు మన దేశంలో అంతర్భాగం. రైతుల సమస్యలకు సంబంధించి ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారం కొరకు అన్ని పార్టీలు, వర్గాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంతో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తారని భావిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేసిన విరాట్.. ‘ఇండియాటుగెదర్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని పెట్టాడు. అయితే ఈ ట్వీట్‌పై భారత నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. రైతు సమస్యలపై నీకేం తెలుసు అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘నీకంటే రిహన్నానే ఎంతో బెటర్’ అంటూ ఫైర్ అవుతున్నారు. మరో నెటిజన్ అయితే ఏకంగా ‘నువ్వు మా సారథివి కాదు హిట్‌మ్యాన్’ అంటూ కోహ్లీ ట్వీట్‌కు ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇదిలాఉంటే.. భారత క్రికెట్ లెజెండ్‌ సచిన్ టెండూల్కర్ కూడా ఈ అంశంపై స్పందించిన విషయం తెలిసిందే. రిహాన్నా ట్వీట్‌ను ఖండిస్తూ ఆయన చేసిన ట్వీట్‌పైనా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Virat Kohli Tweet:

Also read:

Realme Smart Phones: సరికొత్త ఫీచర్లతో భారత మార్కెట్‌లోకి విడుదలైన రియల్‌మీ 5జీ స్మార్ట్‌ ఫోన్లు.. ధర ఎంతంటే..

Bollywood Stars War: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ తారల మధ్య మాటల యుద్ధం..