India Vs England 2021-22: తండ్రి అవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ..
India Vs England 2021-22: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ మ్యాచ్ అనంతరం టీమ్‌ను విడిచి ఇండియాకు..
India Vs England 2021-22: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ మ్యాచ్ అనంతరం టీమ్‌ను విడిచి ఇండియాకు వచ్చిన విరాట్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో పాల్గొంటున్నాడు. తన భార్య అనుష్క శర్మ డెలివరీ నేపథ్యంలో.. విరాట్ పితృత్వ సెలవులపై ఆస్ట్రేలియా టూర్ నుంచి ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్టార్ జంకు అమ్మాయి పుట్టగా.. ‘వమిక’ అని పేరు పెట్టారు.
ఇదిలాఉంటే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నాడు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో కామెంటేటర్లు విరాట్‌ను పలు ప్రశ్నలు వేయగా ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగి తొలి టెస్ట్ మ్యాచ్‌లో 36 పరుగులకే ఆలౌటవడం, పూర్తిస్థాయి ఒత్తిడిలో ఉన్న సమయంలో జట్టును విడిచి వెళ్లడం, సీనియర్లు లేకుండా ఆసిస్‌పై టీమిండియా ఘన విజయం సాధించడంపై ఎలా స్పందిస్తావు అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన విరాట్.. ఏ వ్యక్తికి అయినా తన జీవితంలో తండ్రి అయిన క్షణాలను మించిన గొప్ప సన్నివేశం మరొకటి ఉండదు. గత ఆరేళ్లుగా టీమిండియాకు సారథ్యం వహిస్తున్నానని, ఏనాడూ జట్టుకు దూరమవ్వలేదన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత్‌ను టాప్ పోజిషన్‌లో ఉంచాలనేదే తన ప్రధాన లక్ష్యం అని చెప్పుకొచ్చాడు.
‘ఆస్ట్రేలియాపై ఘన విజయం, తండ్రి కావడం.. రెండింటినీ పోల్చలేము. దేని ప్రాధాన్యత దానిదే. తండ్రి కావడం అనేది నా జీవితంలో మధుర క్షణం. ఆ ఫీల్‌ను ఆస్వాధించిన వారికే అర్థమవుతుంది. దాన్ని ఆస్ట్రేలియా విజయంతో పోల్చలేను. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను జట్టుకు దూరం అవ్వలేదు. నిరంతరం జట్టుకు టచ్‌లోనే ఉన్నాను. గత ఆరు సంవత్సరాలుగా టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాను. ఇన్నేళ్లలో టెస్ట్ క్రికెట్‌లో భారత్‌ను టాప్‌కి తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నించాం. మా అంతిమ లక్ష్యం అదే. టెస్ట్ క్రికెట్‌లో భారత్‌ను టాప్‌లో పెట్టాలనేది మా టీమ్ సంకల్పం. ఇక ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చినప్పటికీ.. ప్రతి మ్యాచ్‌ను నేను చూశాను. ముఖ్యంగా బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మేము క్లినిక్‌లో ఉన్నాం. డాక్టర్ కన్సల్టేషన్‌కి సమయం ఉండటంతో నా మొబైల్ ఫోన్‌లో మ్యాచ్‌ను చూశాను. ఆ సమయంలో శార్దూల్, సుందర్ ఇద్దరూ ఆడుతున్నారు.’ అని హిట్ మ్యాన్ విరాట్ కొహ్లీ చెప్పుకొచ్చాడు.
కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్‌మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్‌లో టీమిండియా కేవలం 36 పరుగలకే ఆలౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆ సందర్భంగా విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులపై తిరిగి ఇండియాకు వచ్చేశాడు. దాంతో అజింక్య రహానే సారథి బాధ్యతలు చేపట్టాడు. మిగిలిన మూడు మ్యాచ్‌లో ఒకటి డ్రా అవ్వగా.. రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్నారు.
Also read:
Overseas tour: ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఝలక్ ఇచ్చిన సర్కార్.. ఇక నుంచి ఆ విషయాలు చెప్పాల్సిందే..
Covaxin: వారికే కొవాగ్జిన్ టీకా.. ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ వైద్య అధికారులు..