ఇంగ్లాండ్‌పై గెలుపే లక్ష్యంగా బరిలోకి, నేటి నుంచే టెస్ట్ సిరీస్ మొదలు.. మరో ప్రతిష్టాత్మక టోర్నీకి టీమిండియా సిద్ధం
ఆస్ట్రేలియా సొంతగడ్డపై ఆసీస్ టీమ్‌ని ఓడించి చరిత్ర సృష్టించి టీమిండియా మరో ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్‌కి సిద్ధమైంది. ఇప్పుడు ఇంగ్లాండ్‌పై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది...
ఆస్ట్రేలియా సొంతగడ్డపై ఆసీస్ టీమ్‌ని ఓడించి చరిత్ర సృష్టించి టీమిండియా మరో ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్‌కి సిద్ధమైంది. ఇప్పుడు ఇంగ్లాండ్‌పై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నేటి నుంచే టెస్ట్ సిరీస్ మొదలవుతోంది. మరోవైపు అప్పుడే టీమిండియాకు సవాల్ విసురుతున్నారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు. ఇప్పటికే ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించి, చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. ఆ విక్టరీ సంబరాల జోష్ ఇంకా తగ్గక ముందే మరో విజయానికి ఉరకలు వేస్తోంది టీమిండియా. ఇప్పుడు ఇక ఇంగ్లాండ్ వంతు అంటోంది కోహ్లీసేన. నేటి నుంచే ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ మొదలవుతోంది.
అయితే టెస్ట్ సిరీస్‌కు ముందే మాటల దాడికి దిగి మానసికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది ఇంగ్లాండ్ టీమ్. మొన్న ఆస్ట్రేలియాను ఓడించిన టీమ్‌ని మానసికంగా దెబ్బతీస్తేనే నెగ్గుకు రాగలం అనుకున్నారో ఏమో.. అప్పుడు స్లెడ్జింగ్ స్టార్ట్ చేశారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కూడా అదే రూట్ పట్టాడు. పరోక్షంగా టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను అడ్డుకోవడం అసాధ్యమని.. అస్త్రశస్త్రాలతో భరతం పట్టేందుకు సిద్దంగా ఉన్నాడని.. టీమిండియా బ్యాట్స్‌మెన్ కాసింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు జో రూట్.
నెట్స్‌లో ఆర్చర్ బంతులు బులెట్ల కంటే వేగంగా వస్తున్నాయని.. టీమిండియా బ్యాట్స్‌మెన్ వాటిని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటం ఖాయమంటున్నారు జో రూట్. కాగా, భారత్‌లో ఆర్చర్ పర్యటించడం ఇదే మొదటిసారి. అయితే ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉండటం వల్ల.. ఇక్కడి పిచ్‌ల గురించి అతడికి బాగా తెలుసు. అటు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లతో పాటు ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్, ఓలీ స్టోన్స్‌లతో ఇంగ్లీష్ బౌలింగ్ ఎటాక్.. ఆర్చర్ రాకతో పటిష్టంగా తయారైంది. అయితే టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడం అంత ఈజీ కాదంటోంది కోహ్లీసేన.
ఇటు టీమిండియా జట్టు కూడా బలంగానే ఉంది. ఆసీస్ ను ఓడించిన టీమ్‌లోని చాలా మంది ప్లేయర్స్ ఇప్పుడు టీమ్‌లో కొనసాగుతున్నారు. అటు యువరక్తంతో పాటు ఇటు సీనియర్ ప్లేయర్ల అనుభవం కూడా తోడు కావడంతో ఇంగ్లాండ్ టీమ్‌పై పై చేయి మాదే అంటోంది కోహ్లీసేన. ఆసీస్‌పై టెస్ట్ సిరీస్‌ని గెలిపించిన హీరో రిషబ్ పంత్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు. దీంతో ఇంగ్లాండ్‌పై కూడా పంత్ ప్రతాపం కొనసాగే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై కసరత్తు, ఆర్థికలోటును పూడ్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ
ఏపీలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంపై పీఠాధిపతుల ఆగ్రహం.. త్వరలో తిరుపతిలో సనాతన ధర్మ పరిరక్షణ మహాసభ