Fake WhatsApp Version: తస్మాత్ జాగ్రత్త.. చక్కర్లు కొడుతున్న నకిలీ వాట్సప్.. ఇన్‌స్టాల్ చేసుకున్నారో అంతే సంగతులు..
Fake WhatsApp Version: సైబర్ నేరగాళ్లే కాదు.. కొన్ని కంపెనీలు సైతం యూజర్లే లక్ష్యంగా ఫేక్ యాప్స్‌ను తయారు చేసి మార్కెట్‌లోకి వదిలేస్తున్నాయి.
Fake WhatsApp Version: సైబర్ నేరగాళ్లే కాదు.. కొన్ని కంపెనీలు సైతం యూజర్లే లక్ష్యంగా ఫేక్ యాప్స్‌ను తయారు చేసి మార్కెట్‌లోకి వదిలేస్తున్నాయి. వాటిని వినియోగించే వారి నుంచి విలువైన సమాచారాన్ని తస్కరించడం.. చివరకు బ్లాక్ మెయిల్‌కు పాల్పడటం చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి వ్యవహారానికి సంబంధించి వార్తలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. వాట్సప్ మెసేజింగ్ యాప్‌కు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు ఉన్నారు. రోజుకు రోజుకు వాట్సప్ వినియోగదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ఇటలీకి చెందిన ఓ కంపెనీ.. ఏకంగా నకిలీ వాట్సప్‌ను సృష్టించింది.
దాన్ని మార్కెట్‌లోకి వదిలింది. అయితే, ఈ యాప్‌ను వినియోగించాలనుకునే యూజర్లు.. తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్న సమయంలో కొన్ని కాన్ఫిగరేషన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు విలువైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. అయితే, ఈ ఫేక్ వాట్సప్‌ను ‘జెక్ఓప్స్’ కంపెనీ గుర్తించగా.. అసలు దీని ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు వాట్సప్ నకిలీని సృష్టించారు? అనే అంశాలపై టొరొంటో యూనివర్సిటీకి చెందిన సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ ల్యాబ్ కూపీ లాగుతోంది. మరి ఇలాంటి మోసాలు జరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండటం మంచిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also read:
Oppo New Smart Phones: ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. అదిరిపోయే ఫీచర్లతో విడుదలకు సిద్ధమైన ఒప్పో స్మార్ట్ ఫోన్స్.. TSRTC Employees: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో ఉద్యోగ భద్రత మార్గదర్శకాలపై సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్..