Brand Value: దేశంలో అత్యంత బ్రాండ్ విలువ ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..? నాలుగోసారి నెం1గా నిలిచిన..
Brand Value Rankings Of 2020: టీమిండియా రథసారధి విరాట్ కోహ్లి తన బ్రాండ్ వ్యాల్యును ఏటా పెంచుకుంటూ పోతూనే ఉన్నాడు. కరోనాలాంటి సంక్షోభ సమయంలోనూ విరాట్ బ్రాండ్ విలువ తగ్గకపోవడం విశేషం...
Brand Value Rankings Of 2020: టీమిండియా రథసారధి విరాట్ కోహ్లి తన బ్రాండ్ విలువను ఏటా పెంచుకుంటూ పోతున్నాడు. కరోనాలాంటి సంక్షోభ సమయంలోనూ విరాట్ బ్రాండ్ విలువ తగ్గకపోవడం విశేషం. జాతీయ స్థాయిలో వ్యక్తిగత బ్రాండ్ వ్యాల్యూ విషయమై తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2020 ఏడాదికిగాను భారత్‌కు చెందిన సెలబ్రిటీల బ్రాండ్ విలువలను.. అంతర్జాతీయ గణాంకాల సంస్థ డఫ్ అండ్ ఫెల్ప్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 237.7 మిలియన్ డాలర్లు విలువ చేసే బ్రాండ్ ఇమేజ్‌తో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ మొదటి స్థానాన్ని విరాట్ వరుసగా నాలుగోసారి పదిలం చేసుకోవడం విశేషం. ఇక విరాట్ తర్వాతి స్థానాల్లో.. టాప్ టెన్‌లో అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, అలియా భట్, ఆయుష్మాన్ ఖురానా, సల్మాన్ ఖాన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్‌లు ఉన్నారు. ఇక బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ 15వ స్థానంలో ఉండగా టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ 17వ స్థానంలో నిలిచాడు. ఇక మరో యంగ్ హీరో కార్తీ ఆర్యన్ 20వ స్థానం దక్కించుకొని తొలిసారి ఈ జాబితాలోకి అడుగపెట్టాడు.