”ప్రేమ గొప్పదైతే చరిత్రలోనూ, సమాధుల్లోనూ కనబడాలి గానీ.. పెళ్లి చేసుకుని..” ఆకట్టుకుంటోన్న ‘ఉప్పెన ట్రైలర్..

Uppena Trailer: ''ప్రేమంటే.. ఓ లైలా మజ్నులా.. దేవదాసు పార్వతిలా'' అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ పక్కా కమర్షియల్ అంశాలతో..

''ప్రేమ గొప్పదైతే చరిత్రలోనూ, సమాధుల్లోనూ కనబడాలి గానీ.. పెళ్లి చేసుకుని..'' ఆకట్టుకుంటోన్న 'ఉప్పెన ట్రైలర్..
Uppena Movie Review
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 04, 2021 | 4:14 PM

Uppena Movie Trailer: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. గతేడాది వేసవికి విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ”ప్రేమంటే.. ఓ లైలా మజ్నులా.. దేవదాసు పార్వతిలా” అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ పక్కా కమర్షియల్ అంశాలతో.. విజయ్ సేతుపతి నటనా విశ్వరూపంతో అదిరిపోయిందని చెప్పాలి. అటు హీరో హీరోయిన్ల పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. ఇక దేవిశ్రీప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు చక్కగా కుదిరింది. కాగా, మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరిన్ని చదవండి:

మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్‌ ప్రకారమే..

టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!