బడ్జెట్‌ 2021 లో తెచ్చిన నిబంధనల మార్పు తర్వాత కూడా వీపీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టాలా?

కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపుపన్నుపై ఈసారి ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు సరికదా, అధిక వడ్డీని పొందే వీపీఎఫ్..

బడ్జెట్‌ 2021 లో తెచ్చిన నిబంధనల మార్పు తర్వాత కూడా వీపీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టాలా?
Follow us

|

Updated on: Feb 05, 2021 | 6:35 AM

కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపుపన్నుపై ఈసారి ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు సరికదా, అధిక వడ్డీని పొందే వీపీఎఫ్ వినియోగదారులకు కూడా కేంద్రం షాకిచ్చింది. పన్ను మినహాయింపుతోపాటు అధిక వడ్డీని పొందేందుకు కొందరు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్(వీపీఎఫ్)ను సాధారణంగా వినియోగించుకుంటూ ఉంటారు. అయితే, ఈ ఏడాదిలో రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉద్యోగి వాటా(12 శాతం), వీపీఎఫ్ కింద జమ అయ్యే మొత్తాలపై ఇక పన్ను పడనుంది. ఒకే ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన మొత్తానికంటే అధికంగా జమ చేసిన వాటిపై వచ్చే వడ్డీపై ఈ పన్ను విధించనున్నారు. దీంతో ఇప్పుడు పీపీఎఫ్ లో పెట్టుబడులు పెట్టాలా వద్దా అనే సందేహం నెలకొంది. వీపీఎఫ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టే వారు బడ్జెట్‌లో ప్రకటించిన నిబంధన మార్పు తర్వాత తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఇపీఎఫ్ వడ్డీపై పన్ను పడకుండా, వీపీఎఫ్‌లో ఎంత పెట్టుబడి పెట్టవచ్చో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇపీఎఫ్ ఇంకా వీపీఎఫ్‌లో మీ మొత్తం పెట్టుబడి రూ .2.5 లక్షలకు చేరుకున్న తర్వాత, పీపీఎఫ్ కోసం వెళ్లండం మంచిదంటున్నారు.