Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి అకౌంట్‌ ఓపెన్‌ చేయడం ఎలా.. ? అందులో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడం ఎలా?

Sukanya Samriddhi Yojana:  భారత ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ది యోజన పథకం. ఆడ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కార్‌..

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి అకౌంట్‌ ఓపెన్‌ చేయడం ఎలా.. ? అందులో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడం ఎలా?
Follow us
Subhash Goud

| Edited By: Team Veegam

Updated on: Feb 08, 2021 | 3:10 PM

Sukanya Samriddhi Yojana:  భారత ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ది యోజన పథకం. ఆడ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర సర్కార్‌ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడ పిల్లలున్న తల్లిదండ్రులకు ఈ పథకం ఒక వరమనే చెప్పాలి. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు, పోస్టాఫీసుల్లో ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ)లో కూడా అకౌంట్‌ను ఓపెన్‌ చేసుకోవడం సులువే.

కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కేవలం ఆడ పిల్లలకు మాత్రమే ఉంది. ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. దీనిలో చేరిన వారు అమ్మాయి పేరుపై ప్రతి నెల కొంత డబ్బు డిపాజిట్‌ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ది స్కీమ్‌లో చేరడం వల్ల అమ్మాయిలకు ఆర్థిక భద్రత లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ స్కీమ్ కేవలం అమ్మాయిలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సుకన్య సమృద్ధి స్కీమ్‌లో చేరడం వల్ల అమ్మాయిలకు ఆర్థిక భద్రత లభిస్తుంది. వివాహం, ఉన్నత చదువులు వంటి వాటి స్కీమ్‌ డబ్బులను ఉపయోగించుకోవచ్చు. అకౌంట్లో మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అయితే ఏడాదిలో కనీసం రూ.250 కూడా చేయవచ్చు. గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిటిట్‌ చేయవచ్చు. అకౌంట్‌లో ఎంత డబ్బు జమ చేయాలనేది మీ ఇష్టం. పదేళ్లలోపు ఆడ పిల్లల పేరుపై మాత్రమే ఈ పథకంపై అకౌంట్‌ను తెరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. పోస్టాఫీసు లేదా బ్యాంక్‌కు వెళ్లి మీరు సుకన్య సమృద్ది అకౌంట్‌ తెరుచుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.6శాతం వడ్డీ లభిస్తోంది. వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తారు. ఈ పథకం ఇన్వెస్ట్‌ చేసే డబ్బులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది.

అయితే సుకన్యసమృద్ది యోజన పథకం అకౌంట్లో డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి మీరు ఖాతా తెరిచిన బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవచ్చు. అలాగే పాస్‌ బుక్‌పై ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు. దీని వల్ల అకౌంట్లో ఎంత డబ్బు ఉందో తెలుస్తుంది. లేదంటే ఆన్‌లైన్‌ ద్వారా కూడా బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా లాగిన్‌ అయి బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. అయితే సుకన్య సమృద్ది యోజన అకౌంట్‌లో అమ్మాయికి 18 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు జమ చేస్తూనే ఉండాలి. 21 ఏళ్లు నిండిన తర్వాత డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

Also Read: Kisan Credit Card: కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ కార్డును ఎవరెవరు పొందవచ్చు

AP IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్​లను బదిలీ సర్కార్ ఉత్తర్వులు.. వివరాలు ఇవిగో

Photographer overaction: ఈ వీడియో చూస్తే.. నవ్వుతో మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం.. అతికి అదిరిపోయే దెబ్బ