Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ కార్డును ఎవరెవరు పొందవచ్చు
Kisan Credit Card: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2021 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు...
Kisan Credit Card: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2021 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలను నడుపుతోంది. అందులో ఒకటి కిసాన్ క్రిడెట్ కార్డు. దీంతో వ్యవసాయ పనులకు తక్కువ రేటుకు రుణాలు అందిస్తోంది. మోదీ ప్రభుత్వం బడ్జెట్‌లో కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని పెంచవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు, పశువులు, మత్స్యకారులు అనేక ప్రయోజనాలను పొందుతారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు బదిలీ చేస్తోంది. ఈ 11 కోట్ల మంది రైతుల భూమి, వారి బయోమెట్రిక్ రికార్డు కేంద్ర సర్కార్ వద్ద ఉంది. అటువంటి పరిస్థితుల్లో వారి కోసం కిసాన్ క్రెడిట్‌కార్డు ద్వారా అందించడం సులభం. మార్చి 2021 నాటికి దేశంలోని రైతులకు మొత్తం రూ.15 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ రుణాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో కేవలం 8 కోట్ల మంది రైతు క్రెడిట్ కార్డు హోల్డర్లు మాత్రమే ఉన్నారు.
– కిసాన్ క్రెడిట్ కార్డు పొందడానికి పీఎం కిసాన్ యోజన(pmkisan.gov.in) అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
– ఆ తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
– మీరు ఆ ఫారమ్‌ను మీ సాగు భూమి పత్రాలు, పంట వివరాలు తదితర వివరాలు నింపాల్సి ఉంటుంది.
– మీరు ఇతర బ్యాంకు నుంచి కిసాన్ క్రెడిట్ కార్డును పొందలేదనే సమాచారం ఇవ్వాలి.
– ఈ కార్డు పొందాలంటే ఓటరు కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏదో ఒకటి చిరునామాగా జిరాక్స్ పత్రం జత చేయాలి.
– కేవైసీను ఏదైనా సహకార బ్యాంకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ) నుంచి పొందవచ్చు.
– ఈ కార్డును ఎస్బీఐ, బీఓఐ, ఐడీబీఐ బ్యాంకు నుంచి కూడా తీసుకోవచ్చు.
– నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రుపే కిసాన్ క్రెడిట్ కార్డు జారీ చేస్తుంది.
– సేవింగ్స్ బ్యాంకు రేటుతో కేసీసీ కిసాన్ కార్డు ఖాతాలోని రుణంపై వడ్డీ చెల్లించబడుతుంది.
– కేసీసీ కార్డు హోల్డర్లకు ఉచితంగా ఏటీఎం మరియు డెబిట్ కార్డ్ అందిస్తారు.
– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ కిసాన్ కార్డు అనే డెబిట్, ఏటీఎం కార్డును ఇస్తుంది.
ఈ కిసాన్ క్రెడిట్ కార్డులో 3 లక్షల రూపాయల వరకు రుణాలకు, సంవత్సరానికి 2 శాతం చొప్పున వడ్డీ తగ్గించి ఇవ్వబడుతుంది.
– రుణాన్ని తిరిగి చెల్లించడానికి సంవత్సరానికి 3 శాతం చొప్పున అదనపు వడ్డీ లభిస్తుంది.
– కేసీసీ రుణాలపై పంటల బీమా సౌకర్యం లభిస్తుంది.
– వ్యవసాయ వ్యయం, పంట కోత ఖర్చులు, భూమి ఖర్చుల ఆధారంగా మొదటి ఏడాదికి రుణం మొత్తం నిర్ణయించబడుతుంది.
కిసాన్ క్రెడిట్ కార్డును ఎవరు తీసుకోవచ్చు
ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాలేదు. పశు సంవర్ధక, మత్స్య సందప అభివృద్ధికి దీని కింద రూ.2 లక్షల వరకు రుణం పొందగలుగుతారు. వ్యవసాయం, మత్స్య సంపద, పశు సంవర్ధకంతో సంబంధం ఉన్న వ్యక్తి అయినా, అతను వేరొకరి భూమిని సాగు చేసినా, దానిని సద్వినియోగం చేసుకోవచ్చు. కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్టంగా 75 ఏళ్లు ఉండాలి. అలాంటి వారు ఈ కార్డును పొందేందుకు అర్హులు.