Rajya Sabha: రైతు ఆందోళనలపై రాజ్యసభలో గందరగోళం.. చర్చకు చైర్మన్ నిరాకరణ.. వాకౌట్ చేసిన విపక్షాలు
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. మంగళవారం సభ ప్రారంభం కాగానే దీనిపై...
Farmers Protest – Rajya Sabha: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. మంగళవారం సభ ప్రారంభం కాగానే దీనిపై చర్చ నిర్వహించాలని విపక్షాలు పట్టుబట్టాయి. అయితే చర్చకు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు నిరాకరించడంతో విపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో సభను 10.30 గంటల వరకూ చైర్మన్ వాయిదా వేశారు. రాజ్యసభ ప్రారంభం కాగానే కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనికి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. రైతుల ఆందోళనపై చర్చ ఈరోజు కాదనీ, బుధవారం ఉంటుందని ఆయన సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
రాష్ట్రపతి కూడా తన ప్రసంగంలో రైతుల ఆందోళనను ప్రస్తావించారని, తాను కూడా రైతుల ఆందోళనపై చర్చ జరపాలని అనుకున్నప్పటికీ లోక్‌సభలో చర్చ మొదట ప్రారంభమవుతుందని చెప్పారని వెంకయ్య తెలిపారు. దీంతో సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో సభను 10.30 గంటల వరకూ చైర్మన్ వాయిదా వేశారు.
Also Read:
Crime News: ఆస్తి తగాదాలు.. మాజీ మంత్రి కోడలు, మనవరాలిని దారుణంగా చంపిన దుండగులు..