కమిటీ కాదు, మొదట వివాదాస్పద చట్టాలు రద్దు చేయండి, కేంద్రంతో రైతు సంఘాల డిమాండ్
తమ డిమాండ్ల పరిశీలనకు కమిటీ వేసే తరుణం ఇది కాదని రైతు సంఘాలు కేంద్రానికి స్పష్టం చేశాయి. మీరు తెచ్చిన చట్టాలు తమ మనుగడను కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టేలా ఉన్నాయని, పానెల్ గానీ కమిటీ గానీ వేసే యోచనను మానుకోవాలని ఈ సంఘాలు..
తమ డిమాండ్ల పరిశీలనకు కమిటీ వేసే తరుణం ఇది కాదని రైతు సంఘాలు కేంద్రానికి స్పష్టం చేశాయి. మీరు తెచ్చిన చట్టాలు తమ మనుగడను కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టేలా ఉన్నాయని, పానెల్ గానీ కమిటీ గానీ వేసే యోచనను మానుకోవాలని ఈ సంఘాలు కోరాయి. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయెల్, మరో జూనియర్ మంత్రి సోమ్ ప్రకాష్ జరిపిన చర్చల్లో రైతులు పదేపదే ఇదే కోరారు. కమిటీల వల్ల ఒరిగేదేమీ లేదని వారు పేర్కొన్నారు. దీనివల్ల కాలయాపన మాత్రమే జరుగుతుందన్నారు.
అటు-ఢిల్లీ-యూపీ లింక్ రోడ్డును రైతులు పూర్తిగా దిగ్బంధం చేశారు. దీంతో చిల్లా బోర్డర్ గా వ్యవహరించే ఈ లింక్ రోడ్డును ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. ఈ మార్గం గుండా ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను వెదుక్కోవాలని సూచించారు. అటు-హర్యానా నుంచి ఖాప్ రైతులు కూడా ఢిల్లీ బాట పట్టారు. తమ రాష్ట్రం నుంచి రైతులెవరూ ఆందోళనలో పాల్గొనడం లేదని ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఇటీవల ప్రకటించారు. కానీ ఆయన వ్యాఖ్యలను రైతులెవరూ పట్టించుకోలేదు. నిన్నటి నుంచీ పెద్ద సంఖ్యలో వీరంతా ఢిల్లీకి బయల్దేరారు.