ప్రధాని నరేంద్ర మోదీ అన్న కూతురు సోనల్ మోదీకి భంగపాటు.. అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వని బీజేపీ..!

ఎన్నికలు జరుగనున్న అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఎన్నికల కోసం బీజేపీ గురువారం తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ అన్న కూతురు సోనల్ మోదీకి భంగపాటు.. అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వని బీజేపీ..!
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 06, 2021 | 6:01 PM

PM Modi’s niece fails to get BJP ticket : గుజరాత్ రాజకీయాల్లో గమ్మత్తు చోటుచేసుకుంది. స్వయాన భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్న కూతురు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు దక్కలేదు. ఇది ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఎన్నికలు జరుగనున్న అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఎన్నికల కోసం బీజేపీ గురువారం తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే, అందులో ప్రధాని మోదీ బంధువు అయిన సోనల్ మోదీ పేరు మాత్రం కనిపించలేదు.

ప్రధాని నరేంద్ర మోదీ అన్న ప్రహ్లాద్ మోదీ కూతురు సోనల్ మోదీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అహ్మదాబాద్ మహానగరానికి చెందిన సోనల్ మోదీ ఎ.ఎం.సిలోని బోడక్ దేవ్ వార్డు నుంచి బీజేపీ తరుపున ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. గుజరాత్ ఫెయిర్ రేట్ షాప్స్ అసోసియేషన్ అధినేత కూడా అయిన సోనల్ మోదీ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, అయితే, రానున్న ఎన్నికల్లో పార్టీ నేతల బంధువులకు టికెట్లు ఇవ్వబోమని గుజరాత్ బీజేపీ ఇటీవల స్పష్టం చేసింది. ఇదే కారణం చేత ఆమెకు టికెట్ ఇవ్వడం కుదరలేదని రాష్ట్ర పార్టీ తేల్చి చెప్పింది. అయితే, తాను ప్రధాని మోదీ బంధువుగా కాకుండా, బీజేపీ కార్యకర్తనని, తనకు టికెట్ కావాలని కోరినట్లు సోనల్ పేర్కొంది.

దీనిపై స్పందించిన గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్.. సోనల్ మోదీకి టిక్కెట్ విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించామని, రూల్స్ అందరికీ సమానమేనని అన్నారు. ఇదిలావుంటే గుజరాత్ లోని రాజ్ కోట్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, భావ్ నగర్, జామ్ నగర్ సహా ఆరు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు ఫిబ్రవరి 21న ఓటింగ్ జరగనుంది. 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఓటింగ్ జరగనుంది.

Read Also… ‘మేడిన్ ఇండియా వ్యాక్సిన్ కోసం క్యూ‌లో 25 దేశాలు’ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడి.