AP Corona Bulletin : ఏపీ కరోనా బులెటిన్ విడుదల.. గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు ఎన్నంటే..!
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,455కి చేరింది. ఇందులో 1,012 యాక్టివ్ కేసులు ఉండగా..
AP Coronavirus Cases : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,455కి చేరింది. ఇందులో 1,012 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,77,284 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు కోవిడ్‌తో 7,159 మంది మరణించారు. ఇక నిన్న133 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 13311542 సాంపిల్స్‌ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 6, చిత్తూరు 16, తూర్పుగోదావరి 13, గుంటూరు 3, కడప 2, కృష్ణా 11, కర్నూలు 4, నెల్లూరు 3, ప్రకాశం 1, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 10, విజయనగరం 2, పశ్చిమ గోదావరి 2 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
#COVIDUpdates: 06/02/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,85,455 పాజిటివ్ కేసు లకు గాను *8,77,284 మంది డిశ్చార్జ్ కాగా *7,159 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,012#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/CMKqEoaSJe
— ArogyaAndhra (@ArogyaAndhra) February 6, 2021
ఇవి కూడా చదవండి
ఏడాది గడిచిన అదే జోరు.. వ్యాక్సిన్ వచ్చిన తగ్గని తీవ్రత.. మాయదారి మహమ్మారికి అంతమెప్పుడు..? Farm Laws: ఆ చట్టాలు.. రైతులు, కార్మికులకే కాదు.. యావత్ దేశానికి ప్రమాదకరం: రాహుల్ గాంధీ