Farm Laws: ఆ చట్టాలు.. రైతులు, కార్మికులకే కాదు.. యావత్ దేశానికే ప్రమాదకరం: రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వెళ్లగక్కారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలతో రైతులకే కాదు..
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వెళ్లగక్కారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలతో రైతులకే కాదు యావత్ దేశానికే ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రైతుల ఆందోళనకు మద్దతుగా రాహుల్ గాంధీ శనివారం ట్విట్ చేశారు. అన్నదాతల శాంతియుత సత్యాగ్రహం జాతీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఉద్యమమని రాహుల్ గాంధీ అభివర్ణించారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు, కూలీలకు మాత్రమే గాక దేశ ప్రజలందరికీ ప్రమాదకరంటూ ఆయన ట్వీట్ చేశారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని ఆయన ఈ సందర్భంగా హామీనిచ్చారు.
अन्नदाता का शांतिपूर्ण सत्याग्रह देशहित में है- ये तीन क़ानून सिर्फ़ किसान-मज़दूर के लिए ही नहीं, जनता व देश के लिए भी घातक हैं।
पूर्ण समर्थन!#FarmersProtests
— Rahul Gandhi (@RahulGandhi) February 6, 2021
కాగా శనివారం దేశ వ్యాప్తం జరిగిన చక్కా జామ్ ఆందోళనల్లో కాంగ్రెస్ నాయకులతో పాటు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ ఆందోళనకు మద్దతిస్తున్నామని.. కాంగ్రెస్ శ్రేణులంతా పాల్గొనాలని ఆపార్టీ నేత దిగ్విజయ్ శనివారం ఉదయం పిలుపునిచ్చారు.
Also Read: