Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహెచ్ఈఎల్ మరో ఘనత.. మధ్యప్రదేశ్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్‌క్రిటికల్‌ ప్లాంట్‌

బీహెచ్ఈఎల్ మరో ముందడుగు వేసింది. మధ్యప్రదేశ్‌లోని గదర్‌ద్వారాలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్‌క్రిటికల్‌ ప్లాంట్‌ను శుక్రవారం విజయవంతంగా ప్రారంభించింది.

బీహెచ్ఈఎల్ మరో ఘనత..  మధ్యప్రదేశ్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్‌క్రిటికల్‌ ప్లాంట్‌
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 06, 2021 | 3:58 PM

BHEL plant in Madhya Pradesh : కాలానుగుణంగా మారుతూ కొత్త అత్యాధునికతను తోడ్పాటు అందిస్తోంది భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌. ఇందులో భాగంగా బీహెచ్ఈఎల్ మరో ముందడుగు వేసింది. మధ్యప్రదేశ్‌లోని గదర్‌ద్వారాలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్‌క్రిటికల్‌ ప్లాంట్‌ను శుక్రవారం విజయవంతంగా ప్రారంభించింది. మధ్యప్రదేశ్‌లో నర్సింగ్‌పూర్‌ జిల్లాలోని గదర్‌ద్వారాలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టును ఎన్‌టీపీసీ అభివృద్ధి చేస్తుండగా… అందులోని రెండు యూనిట్ల నిర్మాణ బాధ్యతలను భెల్‌ చూస్తోంది. తొలి దశలో 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకవస్తున్నట్లు బీహెచ్ఈఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన పరికరాలను హైదరాబాద్‌తో పాటు తిరుచ్చి, హరిద్వార్‌, భోపాల్‌, రాణిపేట, ఝాన్సీ, బెంగళూర్‌ భెల్‌ యూనిట్లలో తయారుచేసినట్లు సంస్థ తెలిపింది. ఈ ఫ్లాంట్ కోసం ఆవిరి టర్బయిన్లు, జనరేటర్లు, బాయిలర్లు, వాటి అనుబంధ పరికరాల రూపకల్పన, ఇంజనీరింగ్‌, సరఫరా ఎరెక్షన్‌, కమిషనింగ్‌, ఎలకో్ట్రస్టాటిక్‌ ప్రిస్పిపిరేటర్స్‌ వంటి పరికరాలు వాడారు. ఇప్పటిదాకా భెల్‌ 660, 700, 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 58 సెట్ల సూపర్‌ క్రిటికల్‌ బాయిలర్లు, 53 సెట్ల సూపర్‌ క్రిటికల్‌ టర్బయిన్‌ జనరేటర్ల తయారీకి దేశీయ, విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం గమనార్హం.

ఇదీ చదవండి… మహారాష్ట్రంలో దారుణం.. రూ.20 కోసం ఓ వ్యక్తి దారుణ హత్య.. ఇడ్లీ విషయంలో గొడవకు దిగిన దుండగులు