ఏడాది గడిచినా అదే జోరు.. వ్యాక్సిన్ వచ్చిన తగ్గని తీవ్రత.. మాయదారి మహమ్మారికి అంతమెప్పుడు..?
ఏడాది గడుస్తున్నా.. రూపం మార్చుకుని విజృంభిస్తోంది. మరోవైపు వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలన్ని ఏకమై వ్యాక్సిన్ రూపొందించాయి. అయినప్పటికీ కరోనా వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.
Coronavirus in India: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మెల్లమెల్లగా ప్రపంచ మొత్తం వ్యాపించింది. ఏడాది గడుస్తున్నా.. రూపం మార్చుకుని విజృంభిస్తోంది. మరోవైపు వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలన్ని ఏకమై వ్యాక్సిన్ రూపొందించాయి. అయినా తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. ఇటు భారత్‌లో ఓవైపు భారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. గత 20 రోజుల్లోనే 50 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బందికి టీకాలు వేశారు. దీంతో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుందని అంతా భావించారు.
అయినప్పటికీ కరోనా వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా రోజుకు 10వేలకుపైగా కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. రోజుకు లక్ష కేసుల నుంచి 10వేల దాకా తగ్గిన సూచీ అక్కడే స్థిరపడిపోయింది. కొత్త కేసులు తగ్గుతాయని భావించిన అధికారులు సైతం ఆలోచనలోపడ్డారు. అయితే, దీనికి కారణం దేశంలో జనాభా సంఖ్య ఎక్కువగా ఉండటమే అంటున్నారు నిపుణులు. కాస్త ఆలస్యమైనా మొత్తానికి భారతదేశం వ్యాప్తంగా కరోనా నుంచి బయటపడగలదని అంటున్నారు.
ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 11,713 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1.08 కోట్లు దాటింది. శుక్రవారం దేశంలోనే అత్యధికంగా కేరళలో 5.6వేల కొత్త కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో 2.6వేలు, తమిళనాడులో 489 వచ్చాయి. మహారాష్ట్రలో 40 మంది చనిపోగా… కేరళలో 19 మంది చనిపోయారు. ప్రస్తుతం 17 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త మరణాలు జీరో ఉన్నాయి.
నిన్న కొత్తగా 95 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 1,54,918కి చేరింది. మరణాల రేటు దేశంలో 1.4 శాతం ఉంది. ఇక రికవరీలు నిన్న 14,488 వచ్చాయి. మొత్తం రికవరీలు 1.05 కోట్లకు పైగా ఉన్నాయి. రికవరీ రేటు ఇండియాలో 95 శాతం ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,48,590 మంది యాక్టివ్ కేసులతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. బెంగాల్‌లో యాక్టివ్ కేసులు 5వేల కంటే తగ్గాయి. ఇప్పుడు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో మాత్రమే యాక్టివ్ కేసులు 5వేలకు పైగా ఉన్నాయి. అండమాన్ నికోబార్‌లో మూడు కొత్త కేసులు వచ్చాయి.
కరోనా మహమ్మారి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. తొలినాళ్లలో లాక్‌డౌన్ విధించి వ్యక్తికి వ్యక్తి మధ్య సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టింది. అన్ని రంగాలు స్తంభించిపోయాయి. ప్రతి ఒక్కరిని ఇంటికే పరిమితం అయ్యారు. అయినప్పటికీ దేశంలో కోటికి పైగా జనం కోవిడ్ ప్రతాపానికి గురయ్యారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా వైద్య సిబ్బంది కంటికి కనిపించని రాకాసితో యుద్దం చేసి దేశ ప్రజలను కాపాడుకోగలిగాం. అయినా కొత్త కేసులు వెలుగుచూస్తుండటంతో మరోసారి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలావుంటే, ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మొత్తం 20.06 కోట్ల మందికి పైగా కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు కరోనా నిర్థారణ పరీక్షల్లో భారత్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే టాప్ 2కి చేరింది. ఇక, అగ్ర రాజ్యం అమెరికాలో ప్రతి 10 లక్షల మందిలో 1.45 లక్షల మందికి టెస్టులు జరగ్గా… ఇండియాలో 2 కోట్ల మందికి పైగా టెస్టులు జరిగాయి. ఇక, భారత్‌లో యాక్టివ్ కేసులు లక్షన్నరకు పడిపోయింది. కాగా, ప్రపంచ కరోనా కేసుల్లో ఒకప్పుడు టాప్ 2లో ఉండే ఇండియా 19వ స్థానానికి పరిమితమైంది. ఇప్పుడు దేశంలోని మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు జస్ట్ 1.37 శాతం మాత్రమే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
కరోనా వైరస్ కట్టడికి అందుబాటులోకి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇండియాలో ఇప్పటివరకు 54 లక్షల మంది వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా, చైనా, బ్రిటన్ తర్వాత మన దేశంలోనే ఎక్కువ వ్యాక్సిన్లు వేశారు. ఇక, ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ (51,319) రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా… బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
రోజువారీ మరణాల్లో అమెరికా (3,198) టాప్‌లో ఉండగా… మెక్సికో (1682), బ్రెజిల్ (1244), బ్రిటన్ (1014), జర్మనీ (776) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ (51,319) రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా… బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా (3,198) టాప్‌లో ఉండగా… మెక్సికో (1682), బ్రెజిల్ (1244), బ్రిటన్ (1014), జర్మనీ (776) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి.