Benefits of Haritaki: పిల్లల ఆరోగ్యాన్ని తల్లిలా కాపాడే సంజీవని.. సర్వరోగ నివారిణి, ముసలితనం రానివ్వని కరక్కాయ

కరక్కాయ త్రిఫలాల్లో ఒకటి.. సంస్కృతంలో హరిత అనిపిలిచే ఇది సర్వరోగ నివారిణి. కరక్కాయ పిల్లల ఆరోగ్యాన్ని తల్లిలా కాపాడే సంజీవని అని ఆయుర్వేదం చెబుతోంది. కరక్కాయ వాత తత్వంపై పనిచేస్తుంది. బుద్ధిని వికసింపజేయడమే..

Benefits of Haritaki: పిల్లల ఆరోగ్యాన్ని తల్లిలా కాపాడే సంజీవని.. సర్వరోగ నివారిణి, ముసలితనం రానివ్వని కరక్కాయ
Follow us

|

Updated on: Feb 09, 2021 | 6:51 PM

Benefits of Haritaki: కరక్కాయ త్రిఫలాల్లో ఒకటి.. సంస్కృతంలో హరిత అనిపిలిచే ఇది సర్వరోగ నివారిణి. కరక్కాయ పిల్లల ఆరోగ్యాన్ని తల్లిలా కాపాడే సంజీవని అని ఆయుర్వేదం చెబుతోంది. కరక్కాయ వాత తత్వంపై పనిచేస్తుంది. బుద్ధిని వికసింపజేయడమే కాదు.. బలం కలిగిస్తుంది. ఎముకలు దృఢంగా పెరిగేలా చేస్తుంది.. ఆయుష్షును పెంచుతుంది. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్దకం, పైల్స్‌, వాంతులు, అసిడిటీ, గ్యాస్‌, నేత్ర స‌మ‌స్యలు దూర‌మ‌వుతాయి.

*స్థూలకాయంతో బాధపడేవారు మజ్జిగలో ఒక చెంచా కరక్కాయ పొడి కలిపి, రోజూ భోజనానికి ముందు తింటే మంచిది.. *రక్తమొలలతో ఇబ్బంది పడుతున్న వారు.. భోజనానికి గంట ముందు, 5 గ్రాముల కరక్కాయ చూర్ణంలో అంతే సమానంగా బెల్లం కలిపి సేవిస్తే తగ్గిపోతాయి. *5 గ్రాముల కరక్కాయ చూర్ణాన్ని 3 గ్రాముల తేనెతో, రోజూ రెండు పూటలా సేవిస్తూ చప్పిడి ఆహారాన్ని తీసుకుంటే, పచ్చకామెర్లు త్వరగా నివారింపబడతాయి. *పిల్లల్లో ఎక్కువుగా వచ్చే కోరింత దగ్గు నివారణకు కరక్కాయ ఎంతో ఉపయోగకారి. అరస్పూను కరక్కాయ చూర్ణం, అందులో సగం పిప్పలి చూర్ణం కలిపి, ఒక గ్రాము తేనెతో ప్రతి నాలుగు గంటలకు ఒకసారి సేవిస్తే, కోరింత దగ్గు తగ్గిపోతుంది. *పసుపు రసాన్ని ఇనుప పాత్రలో వేడి చేస్తూ, అందులో కరక్కాయ పొడి వేసి బాగా కలిపి, లేపనంగా వేస్తే గోరుచుట్టు వ్యాధి తగ్గుతుంది. *కరక్కాయ పొడిని తేనెలో కలిపి తీసుకుంటే విష జ్వరాలు తగ్గుతాయి. *ఈ పొడిని ఆముదంలో కలిపి ప్రతి రోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. *కరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్లు వీటి చూర్ణాలను సమానంగా కలిపి నిల్వచేసుకొని పూటకు అర టీస్పూన్ చొప్పున మూడుపూటలా తేనెతో గాని లేదా నీళ్ళతో గాని కలిపి తీసుకుంటే దగ్గుతోపాటు ఆయాసం కూడా తగ్గుతుంది. *ఆయాసం, ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయల చూర్ణాన్ని అర టీ స్పూన్‌ చొప్పున అరకప్పు వేడినీళ్లతో గాని లేదా తేనె, నెయ్యి మిశ్రమంతోగాని కలిపి తీసుకోవాలి. లేదా బెల్లం పానకంలో కరక్కాయని లేక కరక్కాయ పొడిని వేసి ఉడికించి తీసుకోవాలి. *ఎక్కిళ్లు, ఉబ్బసం, దగ్గు, గుండె జబ్బులు ఒక్కసారే మనపై దాడి చేస్తే… ఉపసమనం కోసం వేడిచేసిన పాత నెయ్యిలో కరక్కాయల పెచ్చుల చూర్ణం, ఇంగువ పొడి, బిడాలవణం చేర్చి కలిపి మోతాదుకు అర టీస్పూన్ చొప్పున రెండుపూటలా తీసుకోవాలి. *రక్తహీనతతో బాధపడేవారు కరక్కాయ‌లను గోమూత్రంలో నానబెట్టి, తరువాత ఎండబెట్టి, పొడిచేసి, పూటకు అర టీస్పూన్ మోతాదులో రెండు పూటలా అర కప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి. *కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, బెల్లం వీటి సమాన భాగాలను కలిపి నిల్వచేసుకొని మోతాదుకు టీస్పూన్ చొప్పున చప్పరించి నీళ్లు తాగాలి. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. మలంతోపాటు జిగురు పడటం ఆగుతుంది. *ముఖ్యంగా శరీరంలో నీరు పట్టడం తగ్గాలంటే.. కరక్కాయల చూర్ణం, ఇప్ప పువ్వు, పిప్పళ్లు చూర్ణం ఈ మూడూ కలిపి పూటకు అరచెంచాడు మోతాదుగా తేనె చేర్చి వేడినీళ్లతో సహా రెండు పూటలా తీసుకుంటే శరీరంలో తయారైన వాపు తగ్గుతుంది. *కరక్కాయ పిందెల చూర్ణాన్ని 3 గ్రాముల మోతాదుగా బెల్లంతో కలిపి అర కప్పు నీళ్లతో తీసుకుంటే శరీరంలో చేరిన వాపు తగ్గడమే కాదు.. కడుపులో ఏమైనా దోషాలుంటే నివారిస్తుంది. *సానరాయిమీద కొద్దిగా నీళ్లు చల్లుతూ గంధం మాదిరిగానే కరక్కాయ రసం తీసి, రెండు టీస్పూన్ల రసానికి టీస్పూను తేనె వేసి కలిపి పరగడుపున పసిపిల్లలకు టీస్పూను చొప్పున కాస్త పెద్ద పిల్లలకు రెండు టీస్పూన్ల చొప్పున తాగిస్తే, కడుపులో దోషం లేకుండా ఉంటుంది. *ఒకటి నుంచి ఐదేళ్ల వరకూ క్రమం తప్పక ఇస్తే రోగనిరోధకశక్తి పెరిగి వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉంటారట. మూడేళ్లలోపు పిల్లలకు చిటికెడు పొడినీ ఆరేళ్లలోపు పిల్లలకు రెండు చిటికెల పొడినీ మరిగించి ఇవ్వాలి. పెద్దవాళ్లయితే అరటీస్పూను పొడి వరకూ రోజూ తీసుకుంటే. జలుబూ జ్వరాలు తరచూ రాకుండా ఉంటాయి. Also Read:

పూర్వకాలంలో అరటి ఆకులో భోజనం ఎందుకు పెట్టేవారో తెలుసా..! అరటి ఆకు భోజనంతో ఎన్నిలాభాలో తెలుసా..!

కొత్తగా పెళ్లైందా.. ఈజీగా ఆన్ లైన్ లోనే ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ మార్చుకోవడం ఎలాగంటే?…