Careers: కోవిడ్ టైంలో ఉద్యోగాలు లేక ఆందోళన చెందుతున్నారా..? వీటిపై దృష్టిసారిస్తే మీ కెరీర్ గాడిన పడినట్టే..

5 alternate career options: కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ మొత్తం అతలాకుతలమైంది. భారత్‌తో సహా చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశంలో కొన్ని కంపెనీలు మూతపడగా.. కొన్ని నష్టాలతో..

Careers: కోవిడ్ టైంలో ఉద్యోగాలు లేక ఆందోళన చెందుతున్నారా..? వీటిపై దృష్టిసారిస్తే మీ కెరీర్ గాడిన పడినట్టే..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 10, 2021 | 11:07 AM

5 alternate career options: కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ మొత్తం అతలాకుతలమైంది. భారత్‌తో సహా చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశంలో కొన్ని కంపెనీలు మూతపడగా.. కొన్ని నష్టాలతో ముందుకుసాగుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది ప్రైవేటు ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయి ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా కారణంగా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పించాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం నానాటికి మెరుగుపడుతున్న ఈ తరుణంలో అందరూ కొన్ని విషయాలను తెలుసుకోవడంతోపాటు మరికొన్ని నైపుణ్యాలను మెరుపర్చుకుంటే రాణించవచ్చంటున్నారు నిపుణులు. మహమ్మారి అనంతర ప్రపంచంలో వృద్ధి చెందడానికి కొన్ని ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి 5 కెరీర్ ఎంపికలను ఒకసారి పరిశీలిద్దాం..

పెరుగుతున్న సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల అవసరం.. ప్రస్తుతం సైబర్‌ సెక్యూరిటీ పరిశ్రమ నిత్యం వృద్ధి చెందుతోంది. గత కొన్నినెలల నుంచి ఐదు శాతానికిపైగా ఉద్యోగాల వృద్ధి కూడా నమోదైంది. కావున నిరుద్యోగులు ఇలాంటి వాటిపై ద‌‌‌ృష్టిసారిస్తే మున్ముందు దూసుకెళ్లొచ్చు. హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీలతోపాటు అన్ని సంస్థల్లో సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు.. అత్యవసరంగా మారింది. దీంతోపాటు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.

కాస్మోటిక్‌ రంగంలో.. కాస్మోటిక్‌ రంగం ఈ మధ్య కాలంలో బాగా విస్తరించింది. కరోనా మహమ్మారి అనంతరం బ్యూటీ, ఫ్యాషన్ ఇండస్ట్రీపై దృష్టిసారిస్తే ఉపాధి సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. కోవిడ్ సమయంలో ఈ రంగం తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం బ్యూటీకేర్‌లు, సెలూన్లు, ఫ్యాషన్ ప్రపంచం గాడిలో పడింది.

డిజిటల్ మార్కెటింగ్‌లో.. ప్రస్తుతం మార్కెటింగ్ రంగమంతా.. ఆన్‌లైన్‌లోనే నడుస్తోంది. కస్టమర్లకు మరింత చేరువవ్వడానికి సంస్థలన్నీ నిపుణులను సంప్రదిస్తున్నాయి. ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్‌ సంస్థలన్నీ ఇప్పుడు ఎస్ఈఓ (Search engine optimization), సీఆర్ఎం (Customer relationship management) నిపుణుల సహాకారాన్ని తీసుకుంటున్నాయి.

ఆన్‌లైన్ టీచింగ్.. కోవిడ్ -19 కారణంగా ప్రస్తుతం విద్యారంగం అంతా ఆన్‌లైన్‌లో నడుస్తున్న సంగతి తెలిసిందే. కావున యువత వర్చువల్ బోధన పద్ధతులను నేర్చుకుంటే మరిన్ని అవకాశాలు దక్కవచ్చు. అంతేకాకుండా నేటి ప్రపంచంలో సాంకేతిక విద్యా బోధన కూడా ఒక పార్ట్‌గా మారింది. దీనిపై దృష్టి సారిస్తే రాణించవచ్చని పలువురు పేర్కొంటున్నారు.

ఫ్రీలాన్సింగ్‌ అవకాశాలు.. కోవిడ్ సమయంలో ఫ్రీలాన్సింగ్ అవకాశాలు మరిన్ని పెరిగాయి. ఇంటి దగ్గరే ఉంటూ ఎన్నో ఉద్యోగాలు చేసుకునే సదుపాయం వచ్చింది. కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, కమ్యూనికేషన్, కోడింగ్, మార్కెటింగ్ వంటి వివిధ రంగాల్లో ఇప్పటికీ కెరీర్ అవకాశాలు చాలా ఉన్నాయి. కావున భవిష్యత్తుకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుంటే.. ఎన్నో రంగాల్లో రాణించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:

అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే.. పెళ్ళికి వెళ్లిన ఓ యువకుడు ఏకంగా కోటి రూపాయలతో తిరిగొచ్చాడు..ఎలా అంటే