Part Time Job Websites: పార్ట్ టైం ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా ? ఫ్రీలాన్స్ జాబ్స్ కోసం 5 వెబ్‌సైట్స్..
ఉద్యోగం చేస్తున్నా మీ ఖర్చులకు డబ్బులు సరిపోవడం లేదా? నెల నెల జీతం తీసుకుంటున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదని బాధపడుతున్నారా ? అలాంటివారి కోసం
ఉద్యోగం చేస్తున్నా మీ ఖర్చులకు డబ్బులు సరిపోవడం లేదా? నెల నెల జీతం తీసుకుంటున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదని బాధపడుతున్నారా ? అలాంటివారి కోసం ఫ్రిలాన్స్ ఉద్యోగాలను అందించే వెబ్ సైట్స్ గురించి తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో ఉద్యోగం చేస్తూ.. నెలవారి జీతం తీసుకుంటున్న అవి ఖర్చులకు సరిపోనీవారు చాలా మందే ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో జాబ్ చేయాల్సిందే. 2020 సంవత్సరం మిగిల్చిన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాలంటే చేస్తున్న ఉద్యోగంతోపాటు మరో ఉద్యోగం చేసి సంపాదించాల్సిందే. కరోనా వైరస్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారు చాలా వరకు ఉన్నారు. దీంతో చాలా మంది ఫ్రీలాన్స్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఫ్రీలాన్స్ జాబ్స్ చేస్తూ.. రెండు చేతులతో డబ్బు సంపాదిస్తున్నారు. మీ కూడా ఫ్రీలాన్సర్‌గా మారాలనుకుంటే మీ కోసం 5 వెబ్‌సైట్స్..
☛ Kiwi .. 2020లో టెక్నోప్రెనియర్ ఇమ్రాన్ లాడివాల మరియు సీరియల్ వ్యవస్థాపకుడు మిషు అహ్లువాలియా అనే ఇద్దరు ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇది రియల్‌టైం ఫ్రీలాన్సింగ్ ఫ్లాట్ ఫాం. ఇందులో ఫ్రీలాన్సర్లను మరియు క్లయింట్లను 2 నిమిషాల్లో కలుపుతుంది. అలాగే ఇందులో క్లయింట్లకు ఉన్న ఆన్ డిమాండ్, టాలెంట్ నెట్‌వర్క్‌ను సృష్టిస్తుంది. స్టార్టప్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే ఇందులో ఫ్రీలాన్స్ జాబ్ చేసేవారికి నిమిషంలో డబ్బు పొందుతారు. ☛Up Work .. ప్రస్తుతం మీరు ఎలాంటి వృత్తిలో ఉన్నా కానీ upwork అనే వెబ్ సైట్ ఫ్రీలాన్సర్‌గా చాలా సహయపడుతుంది. వెబ్ డెవలప్ మెంట్, గ్రాఫిక్ డిజైన్, కస్టమర్ సపోర్ట్ మరియు ఫ్రీలాన్స్ రైటింగ్ వంటి ఉద్యోగాలు ఇందులో చేయొచ్చు. ఇందులో జాబ్స్ పోస్టింగ్స్ నిరంతరం వస్తూనే ఉంటాయి. చిన్న సంస్థల నుంచి పెద్ద కార్పొరేట్ వంటి అన్ని రకాల కంపెనీలు ఇందులో బ్లాగర్స్, ఫ్రీలాన్స్ డిజైనర్స్, ఫ్రీలాన్స్ రైటర్స్ వంటి వారిని ఈ వెబ్ సైట్ ద్వారా ఎంచుకుంటాయి.
☛ Behance .. క్రియేటివ్ ఆలోచనలు ఉన్నవారికి ఈ behance వెబ్ సైట్ సరైనది. యానిమేషన్స్, వెబ్ డిజైన్ వంటి స్కిల్స్ ఉన్నవారికి ఈ వెబ్ సైట్ జాబ్స్ కల్పిస్తుంది. ఈ వెబ్ సైట్ ద్వారా మీ స్కిల్స్ కార్పొరేట్ సంస్థల దృష్టికి వెళ్తుంది. మిమ్మల్ని మీరు నిరుపించుకోవడానికి ఈ వెబ్ సైట్ సహకరిస్తుంది. అలాగే ఇతర కంపెనీ డిజైనర్లతో కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియా నెట్ వర్క్‌గా ఈ వెబ్ సైట్ పనిచేస్తుంది. అలాగే మీ కాంటాక్ట్స్ పరిధిని పెంచి మరిన్ని అవకాశాలను అందిస్తుంది.
☛Kool Kanya .. మహిళలు ఈ 2020లో సంవత్సరంలో ఉద్యోగాలను ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూల్ కన్యా అనే వెబ్ సైట్ ఆన్ లైన్ కమ్యూనిటీ. ఇది యంగ్ ఇండియన్ ఉమెన్స్ కోసం సక్సెస్ ఫుల్ జాబ్ వెతకడానికి ఇది సహయపడుతుంది. అలాగే ఈ వెబ్ సైట్ ద్వారా అనేక రకాల ఉద్యోగాలు, ఉద్యోగ సలహాలు పొందడంతోపాటు కెరీర్ నెట్‌వర్క్‌లో మిమ్మల్ని భాగం చేస్తుంది.
ఈ ఫ్లాట్ ఫాం 2019లో ప్రారంభమైంది. ఇందులో ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ మహిళ-టార్గెటెడ్ సంఘాల సమ్మేళనం. ప్రస్తుతం కాలంలో సమాజంలో ఉన్న పరిస్థితులు నేపథ్యంలో మీకు కావాల్సిన భాష నైపుణ్యాలను, అప్‌స్కిల్లింగ్, ఫ్రీలాన్సింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు మెంటల్ హెల్త్ వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ☛Fiverr.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్రీలాన్స్ సేవలను కొనుగోలు చేయడం అలాగే అమ్మడం అనేవాటిపై ఇది పనిచేస్తుంది. దీనిని 2010లో ప్రారంభించారు. మొదటగా ఇది రూ.5 నుంచి ప్రారంభమైంది. అనేక రకాల ఫ్రీలాన్సింగ్ సైట్స్‌లో మీరు నమోదు కావడానికి ఇది ఎక్కువగా సహయపడుతుంది. ఇందులో చాలా మంది ఫ్రీలాన్స్ వర్కర్స్ నమ్మకపోవచ్చు కానీ..పట్టుదల, శ్రమతో సక్సెస్ కావడానికి ప్రయత్నిస్తే ఈ వెబ్ సైట్ సహయపడుతుంది. ఇప్పటివరకు దాదాపు చాలా మంది డిజైనర్లు ఇందులో వర్క్ చేస్తున్నారు. ఇందులో మీ టాలెంట్ మరియు స్పెషలైజేషన్ సృష్టిస్తే కచ్చితంగా సరికొత్త ప్రాజెక్టులను అందుకునే అవకాశాలు ఉంటాయి.
Also Read: