వారానికి 4 రోజులు పనిచేస్తే చాలు.. 3 రోజులు సెలవులు.. నయా రూల్స్ తేస్తోన్న కేంద్రం..
కేంద్రం ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇవి గనుక అమలులోకి వస్తే వారానికి 4 రోజులు మాత్రమే పనిదినాలు.. 3 రోజులు
కేంద్రం ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇవి గనుక అమలులోకి వస్తే వారానికి 4 రోజులు మాత్రమే పనిదినాలు.. 3 రోజులు సెలవులు ఉండనున్నాయి. అలాగే ఉచిత మెడికల్ చెకప్స్ కూడా ఉండనున్నాయి.
కేంద్రం తీసుకురానున్న ఈ కొత్త రూల్స్‌తో వారానికి 4 పనిదినాలే ఉంటే.. ఉద్యోగులకు ఒక వారంలో 48 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంటే 4 రోజులు పనిచేయాల్సి వస్తే.. రోజు 12 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఈ రూల్స్ గురించి అటు కంపెనీల మీద గానీ, ఉద్యోగుల మీద కానీ కేంద్రం ఎటువంటి ఒత్తిడి చేయదు. ఇందుకు కంపెనీలకు, ఉద్యోగులకు కేంద్రం రెండు ఆప్షన్లు ఇస్తుంది. వారంలో నాలుగు రోజులు పనిచేయాలా ? లేక వారంలో ఆరు రోజులు పనిచేయాలా ? అనేది పూర్తిగా ఉద్యోగులు, కంపెనీల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. వారికి నచ్చిన ఆప్షన్ ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ కంపెనీలు ఇందులో నుంచి ఒక ఆప్షన్‌ను కచ్చితంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ అమలు చేయనుంది. కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తర్వాత 4 రోజులు, 5 రోజుల వర్క్ డేస్ కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి అవసరం లేదు.
Also Read: జీన్స్, టీషర్టులు వేసుకోవడం అక్కడ కుదరదంటే కుదరదు… సర్కార్ ఉద్యోగులకు కొత్త ఆంక్షలు.