అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే.. పెళ్ళికి వెళ్లిన ఓ యువకుడు ఏకంగా కోటి రూపాయలతో తిరిగొచ్చాడు..ఎలా అంటే
'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది'' అనే సామెత మనకు నిత్యం వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తికి మాత్రం ఓ పెళ్లి కోటి రూపాయలను తెచ్చిపెట్టింది. మనం ఒక్క దెబ్బతో లక్షాధికారులు అయిపోయిన వాళ్ళను చూస్తుంటాం...
”ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది” అనే సామెత మనకు నిత్యం వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తికి మాత్రం ఓ పెళ్లి కోటి రూపాయలను తెచ్చిపెట్టింది. మనం ఒక్క దెబ్బతో లక్షాధికారులు అయిపోయిన వాళ్ళను చూస్తుంటాం. లక్ కలిసొచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఓ వ్యక్తి పెళ్లికెళ్ళి కోటి రూపాయలతో తిరిగొచ్చాడు. వివరాల్లోకివెళ్తే.. కర్ణాటకలో మండ్య జిల్లాలోని సోమనహళ్ళి అనే గ్రామానికి చెందిన లాటరీలో కోటిరూపాయలు వచ్చింది.
శోహాన్ బలరామ్ అనే యువకుడు ఇటీవల తన బంధువుల పెళ్ళికి కేరళ వెళ్ళాడు. పెళ్లి తర్వాత అదే ఊరిలో ఉంటున్న దేవదాసు ప్రభాకర్ అనే స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ దేవదాసు నడుపుతున్న షాప్ లో అదృష్టం కలిసి వస్తుందన్న ఆశతో కేరళ భాగ్యమిత్ర లాటరీని 100 రూపాయలు పెట్టి కొన్నాడు. ఆతర్వాత తన కుటుంబసభ్యులతో కలిసి సోమనహళ్ళి తిరిగి ప్రయాణం అయ్యాడు. మార్గమధ్యలో తన స్నేహితుడు ఫోన్ చేసి బలరామ్ కొన్న టికెట్ కు కోటిరూపాయలు లాటరీ వచ్చిందని చెప్పాడు.
మొదట స్నేహితుడు ఆట పట్టిస్తున్నాడనుకున్నాడు శోహాన్ బలరామ్. ఆతర్వాత అతడు కొన్న టికెట్ తీసుకొని తిరిగి కేరళకు రమ్మని ఒత్తిడి చేయడంతో శోహాన్ బలరామ్ వెనుతిరిగారు. తీరా చూస్తే నిజంగానే తనకు లాటరీలో కోటిరూపాయలు కలిసొచ్చింది. సుమారు 48 లక్షల మంది లాటరీ టికెట్ కొంటే అందులో ఐదుమందికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుందని స్థానికులు తెలిపారు. దాంతో ఆయువకుడి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆ డబ్బుతో తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటానని తెలిపాడు బలరామ్.
మరిన్ని ఇక్కడ చదవండి :
చమోలీ ఘటనకు రేడియో యాక్టివ్ పరికరమే కారణమా ? రైనీ గ్రామస్తుల్లో వెల్లువెత్తుతున్న అనుమానాలు