చమోలీ ఘటనకు రేడియో యాక్టివ్ పరికరమే కారణమా ? రైనీ గ్రామస్తుల్లో వెల్లువెత్తుతున్న అనుమానాలు
ఈ నెల 7 న ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో జరిగిన గ్లేసియర్ ఔట్ బరస్ట్ ఘటనకు ఓ అణుధార్మిక పరికరమే కారణమై ఉండవచ్చునని ఈ జిల్లాలోని రైనీ గ్రామస్థులు అనుమానిస్తున్నారు.
ఈ నెల 7 న ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో జరిగిన గ్లేసియర్ ఔట్ బరస్ట్ ఘటనకు ఓ అణుధార్మిక పరికరమే కారణమై ఉండవచ్చునని ఈ జిల్లాలోని రైనీ గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఆదివారం నాటి పెను విపత్తులో ఆకస్మిక వరదల కారణంగా రిషిగంగా డ్యామ్ కొట్టుకుపోగా 14 మంది మృతి చెందారు. ఇంకా రైనీ గ్రామస్థుల కథనం ప్రకారం..చైనాపై గూఢచర్యం కోసం 1965 లో సీఐఏ, ఇంటెలిజెన్స్ బృందమొకటి నందాదేవి శిఖరానికి రహస్య సాహస యాత్ర చేపట్టిందట. ఆ సందర్భంగా ఈ రేడియో యాక్టివ్ పరికరాన్ని వారు అక్కడే ఉంచారని, అయితే ఒక్కసారిగా వాతావరణం బాగులేకపోవడంతో దాన్ని అక్కడే వదిలేసి తిరుగు ప్రయాణమయ్యారని ఈ గ్రామస్థులు తెలిపారు. ఇదంతా తమ పెద్దలు చెబుతున్న మాట అన్నారు. ఇక ఏడాది తరువాత కొన్ని బృందాలు ఆ అణుధార్మిక పరికరం కోసం వెదికినా కనిపించలేదట. దాని జీవితకాలం 100 ఏళ్ళని తెలుస్తోంది.
అది ఇంకా ఆ ప్రాంతంలోనే ఎక్కడో ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. నందాదేవి హిల్ సమీపంలోనే ఉన్న రైనీ గ్రామం ఈ నెల 7 న పెను విపత్తుకు తీవ్రంగా గురైంది. వరదలు సంభవించినప్పుడు ఈ కొండ శిఖరంపై నుంచి మట్టి, చరియలు, బండరాళ్లు విరిగి కిందనున్న రిషిగంగా నదిలో పడుతుండగా భరించలేని దుర్వాసన వచ్చిందని, దాని ధాటికి తాము శ్వాస కూడా తీసుకోలేకపోయామని ఈ గ్రామస్థులు వెల్లడించారు. బహుశా ఈ అణుధార్మిక పరికరం తీవ్రంగా వేడెక్కిపోయి ఈ ఉత్పాతానికి కారణమై ఉండవచ్ఛు అని వారంటున్నారు. 1965 నాటి బృందంలో ఒకరి తల్లి అయిన ఇమర్తి దేవి అనే 90 ఏళ్ళ వృద్దురాలు ఈ మెరుపు వరదల్లో కొట్టుకుపోయింది.
Read More:రిపబ్లిక్ దినోత్సవం నాటి అల్లర్ల సూత్రధారి పంజాబీ నటుడు దీప్ సిద్దుకి 7 రోజుల పోలీస్ కస్టడీ,
Read More:అదిరిపోయే పాలసీ.. రోజుకు రూ. 120 పెట్టుబడి పెడితే.. రూ. 27 లక్షలు పొందొచ్చు.. వివరాలు ఇవే..