AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Important Deadlines:అలర్ట్‌.. ఈ చివరి గడువు తేదీలను గుర్తించుకోండి.. లేకపోతే మీరు చిక్కుల్లో పడాల్సిందే

Important Deadlines: ప్రతి రోజు చాలా మందికి ఎన్నో ముఖ్యమైన పనులుంటాయి. కొందరు పనులను వాయిదా వేస్తుండటంతో తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. పనులు ...

Important Deadlines:అలర్ట్‌.. ఈ చివరి గడువు తేదీలను గుర్తించుకోండి.. లేకపోతే మీరు చిక్కుల్లో పడాల్సిందే
Subhash Goud
|

Updated on: Feb 09, 2021 | 7:56 PM

Share

Important Deadlines: ప్రతి రోజు చాలా మందికి ఎన్నో ముఖ్యమైన పనులుంటాయి. కొందరు పనులను వాయిదా వేస్తుండటంతో తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. పనులు పూర్తి చేసుకునేందుకు చివరి గడువు తేదీ ఉన్నప్పటికీ నిర్లక్ష్యం కారణంగా గడువు ముగిసిపోతుంటుంది. అలాంటి సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అయితే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన గడువు తేదీలు సమీపిస్తున్నాయి. ఆ గడువు తేదీలోగా పనులు పూర్తి చేసుకుంటే మరి మంచిది. లేకపోతే చిక్కుల్లో పడాల్సిందే. అయితే కొందరికి గడువు తేదీ తెలిసి ఉండవు. తర్వాత తెలుసుకుని బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పనులను పూర్తి చేసుకునేందుకు గడువు తేదీలు సమీపిస్తున్నాయి. ఇవేమిటంటే..

1. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్స్‌ ఫైల్‌ చేయడానికి 2021 జూలై 31 చివరి తేదీ.

2. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 90ఈ కింద రిపోర్టు చేయాల్సిన వారికి, అకౌంట్‌ ఆడిట్‌ చేయాల్సిన వారికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ.

3. డివిడెంట్‌ ద్వారా వచ్చే ఆదాయం 2020 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పన్ను పరిధిలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కన్నా ఎక్కువ డివిడెంట్‌ వస్తే పన్ను చెల్లించాలి. ఇందుకు సంబంధించి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ పేమెంట్‌ 2021 మార్చి 15లోగా చేసుకోవాలి.

4. పాన్‌కార్డు ఆధార్‌ కార్డు నెంబర్లు లింక్‌ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ గడువు లోగా లింక్‌ చేయాల్సి ఉంటుంది. ఈ గడువు 2020 జూన్‌ 30తో ముగియగా, దానికి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి లోగా పాన్‌ ,ఆధార్‌ నెంబర్లను లింక్‌ చేయకపోతే కార్డు పని చేయదు.

5. ఎల్‌టీసీ క్యాష్‌ వోచర్‌ స్కీమ్‌ ద్వారా పన్ను మినహాయింపు పొందేందుకు చివరి తేదీ 2021 మార్చి 31. అయితే 2020 అక్టోబర్‌లో ఈ స్కీమ్‌ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం ప్రకటించింది. ఆ తర్వాత ప్రైవేటు సెక్టార్‌ ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్‌ అమలు చేసింది.

6. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్‌, బిలేటెడ్‌ ఐటీఆర్‌ ఫైల్‌ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. లేకపోతే రూ.10వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

7. పెన్షన్‌ పొందుతున్న వారు తమ లైఫ్‌ సర్టిఫికేట్‌ అందజేసేందుకు గడువు ముగియగా, దానిని అధికారులు పొడిగించారు. ఆ గడువును ఫిబ్రవరి 28 తేదీకి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.

8. కోవిడ్‌ కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జేన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌ 2021 మార్చి 31న ముగుస్తుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 మే 13న ఈ స్కీమ్‌ను ప్రకటించింది.

9. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన- PMAY పథకంలో భాగంగా క్రెడిట్‌ సబ్సిడీ పొందేందుకు 2021 మార్చి 31 చివరి తేదీ. మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూప్స్‌ అంటే రూ.6,00,000 నుంచి రూ.18,00,000 మధ్య వార్షికాదాయం ఉన్నవారు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది.

10. ఎల్‌టీఐ క్యాష్‌ వోచర్‌ స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఫెస్టివల్‌ అడ్వాన్స్‌ స్కీమ్‌ ద్వారా రూ. 10 వేలు పొందేందుకు 2021 మార్చి 31వ చివరి తేదీ. ఈ మొత్తాన్ని 10 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.

11. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్‌ సేవింగ్స్‌ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ.

Also Read:

Post Office Monthly Income Scheme: అదిరిపోయే బెనిఫిట్.. పోస్టాఫీసులో ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.5 వేల ఆదాయం

LIC Policy Holders: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. త్వరలో రానున్న ఎల్‌ఐసీ ఐపీవో వీళ్లకే ప్రాధాన్యత

అదిరిపోయే పాలసీ.. రోజుకు రూ. 120 పెట్టుబడి పెడితే.. రూ. 27 లక్షలు పొందొచ్చు.. వివరాలు ఇవే..

Tea Plant: తేయాకును కొండ ప్రాంతాల్లోనే ఎందుకు పండిస్తారు..? అసోం టీ ప్రత్యేకత ఏమిటి..?

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి అకౌంట్‌ ఓపెన్‌ చేయడం ఎలా.. ? అందులో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడం ఎలా?